ఎన్ కౌంట‌ర్ లో చ‌నిపోయిన 25 మంది జ‌వానుల కుటుంబాల‌కు..ఇండ్ల‌ను క‌ట్టించి ఇచ్చిన హీరో.!!

”ఓ సినీ న‌టుడిగా నేను జీవితంలో ఎన్నో అవార్డుల‌ను నా న‌ట‌న‌కు అందుకున్నా. వాటిని ఇంటికి తీసుకెళ్లి షోకేస్‌లో పెట్ట‌డం త‌ప్ప, వాటితో పెద్ద‌గా ప‌నుండ‌దు. అవేవీ నాకు సంతృప్తి ఇవ్వ‌వు. నేను న‌డుపుతున్న అనాథాశ్ర‌మానికి వెళ్లి అక్క‌డ పెరుగుతున్న పిల్ల‌ల‌ను చూస్తేనే నాకు ఆనందం క‌లుగుతుంది. సినిమాలు, అవార్డులు నాకు ఆనందాన్ని క‌లిగించ‌వు”… ఈ మాట‌ల‌న్న‌ది ఎవ‌రో తెలుసా..? ప‌్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు వివేక్ ఆనంద్ ఓబెరాయ్‌. అవును, నిజంగా ఆయ‌న మాట‌లు మాట్లాడే మ‌నిషి కాదు, చేత‌ల మ‌నిషి. అందుకే ఆయ‌న ఇప్ప‌టికే ఎన్నో స‌మాజ సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డ‌మే కాదు, సొంతంగా ప‌లు చారిటీల‌ను, ప్రాజెక్ట్‌ల‌ను ర‌న్ చేస్తున్నాడు. ఇక వివేక్ ఒక్క‌డే కాదు, ఆయ‌న కుటుంబం మొత్తం స‌మాజ సేవ‌లోనే నిమ‌గ్న‌మైంది.

వివేక్ ఒబెరాయ్ త‌ల్లిదండ్రులు సురేష్ ఒబెరాయ్‌, య‌శోద‌ర ఒబెరాయ్‌ ఇద్ద‌రూ గ‌త 30 ఏళ్ల‌కు పైగా వీధి బాల‌ల సంక్షేమం కోసం ప‌నిచేస్తున్నారు. వారికి విద్యా బుద్ధులు చెప్పించ‌డంతోపాటు క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు చేయూత‌ను అందిస్తున్నారు. ఇక వివేక్ సోద‌రి మేఘ‌న ఓ ఆర్టిస్ట్‌. త‌న ఆర్ట్ వ‌ర్క్‌ను అమ్మి త‌ద్వారా వ‌చ్చిన డ‌బ్బును చారిటీల‌కు, పేద‌ల‌కు విరాళంగా ఇస్తుంది. వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక అల్వా కూడా స‌మాజ సేవ‌లో నిమగ్నమైంది. త‌న ఫిలాంత్రొఫీ వ‌ర్క్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌ను ఆమె సామాజిక కార్య‌క్ర‌మాల కోసం వినియోగిస్తుంది.

ఇక వివేక్ ఒబెరాయ్ విష‌యానికి వ‌స్తే చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు స‌మాజ సేవ ప‌ట్ల మ‌క్కువ ఎక్కువ‌. ఈ క్ర‌మంలోనే ONE (Oberoi Nation Building and Empowerment) పేరిట సొంతంగా చారిటీ సంస్థ‌ను న‌డుపుతున్నాడు. DEVI (Development and Empowerment of Vrindavan Girls Initiative) పేరిట వృందావ‌న్ అనే ప్రాంతంలో ఉన్న పేద బాలిల‌కు స‌హాయం అందిస్తున్నాడు. వారికి విద్యాబుద్ధులు చెప్పించ‌డం, స్వ‌యం ఉపాధి క‌ల్పించ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. అదేవిధంగా Set Beautiful Free పేరిట సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను చేర‌దీసి వారికి పున‌రావాసం క‌ల్పిస్తున్నారు. వారు త‌మ సొంత కాళ్ల‌పై నిల‌బ‌డేలా స్వ‌యం ఉపాధి క‌ల్పిస్తున్నారు. వారి పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పిస్తున్నారు. ఇక వివేక్ ఒబెరాయ్ Banyan అనే మ‌రో స్వ‌చ్ఛంద సంస్థ‌కు కూడా త‌న వంతు స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తున్నారు. నిరుపేద‌ల‌కు, మాన‌సిక విక‌లాంగుల‌కు స‌హాయం చేస్తున్నారు.

ఇవి వివేక్ ఒబెరాయ్ చేసిన, చేస్తున్న‌ సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు. అయితే చెప్పాలే కానీ ఇంకా చాలానే ఉన్నాయి. ల‌లిత బెన్‌బ‌న్సి అనే యాసిడ్ అటాక్ బాధితురాలు పెళ్లి చేసుకుంటే ఆమెకు సొంతంగా ఓ ఫ్లాట్ కొని బ‌హుమ‌తిగా ఇచ్చారు వివేక్ ఒబెరాయ్‌. మొన్నా మ‌ధ్య ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన 25 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు 25 ఫ్లాట్ల‌ను కొని ఇచ్చారాయన‌. 2016లో ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల కోసం రూ.30 ల‌క్ష‌ల విరాళం ఇచ్చారు. ఇవన్నీ వివేక్ ఒబెరాయ్ చేసిన ప‌నులే అంటే న‌మ్మ‌గ‌ల‌రా..! అవును, ఇత‌రుల‌కు స‌హాయం చేయాల‌నే త‌ప‌న ఉండాలే గానీ, ఎవ‌రైనా ఏ చిన్న స‌హాయం అయినా చేయ‌వ‌చ్చు. వివేక్ త‌న‌కు క‌లిగిన దాంట్లో చాలానే ఇలా సామాజిక సేవ‌కు ఖర్చు పెడుతున్నాడు క‌నుక ఆయ‌న్ను ఎన్నిసార్లు పొగిడినా అది త‌క్కువే అవుతుంది..! ఇంత చేసినా ఆయ‌న ఇంకా ఏదో చేయాల‌నే త‌ప‌నతో ఉండ‌డం విశేషం..!

Comments

comments

Share this post

scroll to top