ఫోన్ల‌లో ఉండే ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్లు ఎలా ప‌నిచేస్తాయో తెలుసా..?

ఒక‌ప్పుడు మ‌నం వాడిన పాత త‌రం ఫోన్ల‌లో అస‌లు లాక్‌లే లేవు. కీప్యాడ్ మీద ఉండే బ‌ట‌న్ల‌ను ప్రెస్ చేస్తే ఫోన్లు లాక్ అయ్యేవి. త‌రువాతి కాలంలో పాస్‌వ‌ర్డ్‌, ప్యాట్ర‌న్ లాక్ పెట్టుకోగ‌లిగే ఫోన్లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఫింగర్‌ప్రింట్‌, ఐరిస్ స్కాన‌ర్‌లు వ‌చ్చేశాయి. ఈ క్ర‌మంలోనే నేటి త‌రుణంలో మ‌న‌కు ల‌భిస్తున్న చాలా వ‌ర‌కు ఫోన్ల‌లో ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో మ‌నం ఫోన్ల‌ను అన్‌లాక్ చేసుకుంటున్నాం. కొన్ని ఫోన్ల‌లో ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ల ద్వారా ఫొటోలు తీసుకుంటున్నాం, ఇత‌ర ప‌నులు కూడా చేసుకుంటున్నాం. అయితే నిజానికి మీకు తెలుసా..? అస‌లు ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్లు ఎలా ప‌నిచేస్తాయో..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌లో మొత్తం 3 ర‌కాలు ఉన్నాయి. అవి ఆప్టిక‌ల్‌, కెపాసిటివ్‌, అల్ట్రాసోనిక్ అని మూడు ఫింగ‌ర్‌ప్రింట్ స్కానర్లు ఉన్నాయి. అయితే కేవ‌లం ఆప్టిక‌ల్‌, కెపాసిటివ్ అనే రెండు ర‌కాల ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌నే స్మార్ట్‌ఫోన్ల‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆప్టిక‌ల్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌ ఎలా ప‌నిచేస్తుందంటే… ఇందులో చిన్న‌పాటి కెమెరా ఉంటుంది. అది మ‌న ఫింగ‌ర్‌ప్రింట్‌ను వివిధ ర‌కాలుగా స్కాన్ చేసి డిజిట‌ల్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ డిజిట‌ల్ ఇమేజ్‌ను అంత‌కు ముందే ఫోన్‌లో సేవ్ అయిన మ‌రో డిజిట‌ల్ ఇమేజ్‌తో పోలుస్తుంది. ఆ క్ర‌మంలో సేవ్ అయి ఉన్న డిజిట‌ల్ ఇమేజ్‌తో అప్పుడు తీసిన డిజిట‌ల్ ఇమేజ్ స‌రిపోతే ఫోన్ అన్‌లాక్ అవుతుంది. ఇలా ఆప్టికల్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ ప‌నిచేస్తుంది.

ఇక కెపాసిటివ్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ ఎలా ప‌నిచేస్తుందంటే… మ‌నం స్కాన‌ర్‌పై వేలిని ఉంచిన‌ప్పుడు దాని కింద ఉండే చిన్న చిన్న కెపాసిటర్ సర్క్యూట్లు మ‌న వేలి ముద్ర‌ను అన‌లాగ్ ఫార్మాట్‌లో కాప్చ‌ర్ చేస్తాయి. అనంత‌రం దాన్ని డిజిటల్ ఇమేజ్‌గా మార్చుతాయి. అప్పుడు ఆ డిజిట‌ల్ ఇమేజ్ అంతకు ముందు సేవ్ అయి ఉన్న డిజిట‌ల్ ఇమేజ్‌తో పోల్చి ఆ రెండు ఇమేజ్‌లు స‌రిపోతే అప్పుడు డివైస్‌ను అన్‌లాక్ చేస్తుంది. ఇలా కెపాసిటివ్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ ప‌నిచేస్తుంది. అయితే ఈ రెండు ఫింగర్‌ప్రింట్ స్కానర్ల‌లో జ‌రిగే ఆ ప్రాసెసింగ్ అంతా కేవ‌లం సెకన్‌లో కొన్ని వంతుల వ్య‌వ‌ధిలో మాత్ర‌మే పూర్తి అవుతుంది. అంత వేగంగా అవి ఫింగ‌ర్‌ప్రింట్ ఇమేజ్‌ల‌ను ప్రాసెస్ చేస్తాయి. అందుకనే మనం ఫోన్ల‌ను ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల ద్వారా అంత వేగంగా అన్‌లాక్ చేసుకుంటాం. ఏది ఏమైనా.. ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్లు ఇంత వేగంగా మ‌న వేలిముద్ర‌ల‌ను ప్రాసెస్ చేస్తాయంటే నిజంగా న‌మ్మ‌శ‌క్యంగా లేదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top