అంత‌రిక్షంలో వ్యోమ‌గాములు త‌ల‌స్నానం ఎలా చేస్తారో తెలుసా..?

భూమి మీద ఉన్నంత వ‌రకు మ‌నం ఏ ప‌నినైనా చాలా సుల‌భంగా చేస్తాం. ఎందుకంటే గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి ఉంటుంది క‌దా. క‌నుక చిన్న‌ప‌ని కూడా మ‌న‌కు క‌ష్టం అనిపించ‌దు. అయితే అంత‌రిక్షంలో ఉంటే మాత్రం చాలా చిన్న పనుల‌ను చేసుకోవాలంటేనే క‌ష్టంగా ఉంటుంది. ఆహారం తినాల‌న్నా, నీరు తాగాలన్నా, తిన్న‌ది అర‌గాల‌న్నా, స్నానం చేయాల‌న్నా… ఇలాంటి చిన్న ప‌నుల‌కే శ్ర‌మ ప‌డాల్సి వ‌స్తుంది. అయితే అందుకు వ్యోమ‌గాములు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు బాగా ట్రెయిన్ అయి ఉంటారు కాబ‌ట్టి ఆ ప‌నుల‌ను చేసుకోగ‌ల‌రు. మరి తిండి తిన‌డం వ‌రకు ఓకే, స్నానం మాటేమిటి..? అదెలా సాధ్య‌మ‌వుతుంది..? అనేగా మీ డౌట్‌..! అదెలా వీలువుతుందో చూడండి.

చూశారుగా పై వీడియోల‌ను బ‌ట్టి మీకేం తెలుస్తుంది. అవును, వాళ్లు స్నానం చేయ‌డం సుల‌భ‌మే. మొద‌టి వీడియోలో ఓ మహిళ‌, రెండో వీడియోలో ఒక వ్యక్తి ఇద్ద‌రూ త‌ల‌స్నానం చేశారు. చూసేందుకు అలా అనిపించ‌దు. ఏదో ఆయిల్ పెట్టుకున్న‌ట్టు ఉంటుంది. కానీ వారు నిజానికి చేసింది త‌ల‌స్నాన‌మే.

మొద‌ట ప్ర‌త్యేక‌మైన నీటిని త‌ల‌కు రాసుకున్నారు. వాటిల్లోంచి కొన్ని నీటి బిందువులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయినా వాటిని ప‌ట్టుకుని త‌ల‌కు రాసుకున్నారు. అనంతరం షాంపూ అప్లై చేసి రుద్దుకున్నారు. ఆ త‌రువాత ట‌వ‌ల్‌తో తుడుచుకున్నారు. అంతే.. సింపుల్‌గా త‌ల‌స్నానం చేసేశారు. అయితే ఆ వ్య‌క్తిక‌న్నా మ‌హిళే ఎక్కువగా ఇబ్బంది ప‌డింది. ఎందుకో తెలుసు క‌దా, ఎక్కువ హెయిర్ ఉండ‌డం వ‌ల్ల రెండు, మూడు సార్లు షాంపూ పెట్టుకోవాల్సి వ‌చ్చింది. చూశారుగా… అంత‌రిక్షంలో వ్యోమ‌గాములు త‌ల‌స్నానం ఎలా చేస్తారో..!

Comments

comments

Share this post

scroll to top