ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకడిగా పేరుగాంచిన ముకేష్ అంబానీ ఇంట్లో త్వరలో రెండు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ నిశ్చితార్థం శ్లోకా మెహతా అనే యువతితో జరగ్గా, వీరి వివాహం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. ఇక ముకేష్ కుమార్తె ఈషా అంబానీ కూడా ప్రేమలో పడింది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ పిరామల్ కుమారుడు ఆనంద్ పిరామల్‌తో ప్రేమలో పడింది. దీంతో వీరి పెళ్లి కూడా త్వరలో చేయనున్నారని తెలిసింది. ఇక ఇషా అంబానీ గురించి మనకు ఇది వరకే తెలుసు. ఆమె జియోతోపాటు రిలయన్స్ రిటైల్ లోనూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.
ఈషా అంబానీ, అనంద్ పిరామల్ ల కుటుంబాలు ఎంతో కాలం నుంచి దగ్గరగా ఉంటున్నాయట. దీంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అందులో భాగంగానే వీరి వివాహం కూడా ఈ ఏడాది డిసెంబర్ లో జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని, మంచి స్నేహితులని తెలిసింది. దీంతో ఆ ప్రేమ బంధం కాస్తా త్వరలో పెళ్లి బంధం కానున్నదన్నమాట. ఇక ఈషా ప్రియుడు ఆనంద్ పిరామల్ విషయానికి వస్తే తను దేశంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన పిరామల్ రియాల్టీ బాధ్యతలను చూసుకుంటున్నాడట. దీంతోపాటు స్వస్తయ్ హెల్త్ కేర్ స్టార్టప్‌ను అంతకు ముందే ఆనంద్ పిరామల్ ప్రారంభించారట. ఇదొక గ్రామీణ ఆరోగ్య కేంద్రం. రోజుకు 40వేల ఆపరేషన్లను అందులో చేస్తారట.
ఇక ఆనంద్ పిరామల్ పిరామల్ గ్రూపులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇతను మర్చంట్ చాంబర్ యూత్ వింగ్‌కు పిన్న వయస్సులోనూ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆనంద్ విద్యార్హతల విషయానికి వస్తే యూనివర్శిటీ ఆఫ్ పెన్సెన్వెలియాలో ఎకనమిక్స్‌లో బ్యాచిలర్ డ్రిగీ సాధించగా, హార్వర్డ్ బిజినెస్ స్కూలు నుంచి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశాడు. ఇక ఇషా అంబానీ విద్యార్హత విషయానికొస్తే యెల్ యూనివర్శిటీ నుంచి సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పొందింది. ఈ ఏడాది జూన్ నాటికి ఆమె స్టాన్ఫోర్డ్ విశ్వవి ద్యాలయం నుంచి మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మిని స్ట్రేషన్ పూర్తి చేయనుంది.
ఈషా అంబానీ, ఆనంద్ పిరామల్ ల వివాహం గురించి తెలుస్తున్న వివరాల ప్రకారం… ఇటీవల మహాబలేశ్వర్‌లోని మందిరంలో ఆనంద్ ప్రపోజ్ చేయగా ఈషా అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. కాగా ఆ కార్యక్రమానికి ఇరువురి తల్లిదండ్రులు నీతా, ముకేష్ అంబానీలు, స్వాతి, అజయ్లతో పాటు ఈషా నానమ్మ కోకిలాబెన్ అంబానీ, పూర్ణిమా బేన్ దలాల్, ఈషా సోదరులు ఆకాశ్, అనంత్ అంబానీలు, ఆనంద్ సోదరి నందిని, పీటర్, ఆన్య, దేవ్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారని సమాచారం.
ఆనంద్ పిరామల్ (25) విషయానికొస్తే.. ఇతను బిలియనీర్, వ్యాపారవేత్త, పిరామల్ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరామల్ కుమారుడు. హార్వర్డ్ బిజినెస్ స్కూలులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం పిరామల్ గ్రూపులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. పిరామల్ గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యవహారాలను ఆనంద్ చూస్తున్నాడు. కంపెనీల అభివృద్ధికి కొత్త కొత్త వ్యూహాలు రచిస్తుంటాడు. పిరామల్ గ్రూపులో చేరకముందు అతను సొంతంగా పిరామల్ ఈ స్వస్తయ్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం సగటు భారతీయుడికి అందుబాటు ధరల్లో వైద్య సేవలందించడం. దీంతోపాటు ఇండియన్ మర్చంట్ చాంబర్ (యూత్వింగ్)కు అత్యంత చిన్న వయసులో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించాడు.
పిరామల్ హెల్త్‌కేర్ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఆనంద్ రెండవ వెంచర్ పిరామల్ రియల్టీ అనే రియల్ ఎస్టేట్ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం నాలుగు బిలియన్ డాలర్ల పిరామల్ ఎంటర్‌ప్రైజెస్‌లో భాగస్వామ్యమయ్యాయి. పనిలో పనిగా తనను వ్యాపారవేత్తగా తయారు చేయడానికి ప్రోత్సహించినందుకు ఇటీవలే ఆనంద్ ముకేష్ అంబానీకి ధన్యవాదాలు తెలిపాడు. ముంబైలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను ముకేష్ అంబానీని కన్సెల్టింగ్ లేదా బ్యాంకింగ్ రంగంలో ప్రవేశిస్తే బాగుంటుందా అని సలహా కోరానని, దీనికి ముకేష్ సమాధానమిస్తూ.. కన్సెల్టింగ్ రంగంలోకి దిగితే క్రికెట్ మ్యాచ్ చూసినట్లు లేదా క్రికెట్ గురించి కామెంటేటర్‌గా వ్యవహరించినట్లు ఉంటుందని, ఒక వేళ వ్యాపారవేత్తగా మారితే క్రికెట్ ఆడినట్లుగా ఉంటుందన్నారు. కామెంటేటర్ ద్వారా క్రికెట్ ఎలా ఆడాలో నేర్చుకోలేవు. నీవు ఏదైనా సాధించాలనుకుంటే దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకుని వ్యాపారవేత్తగా మారు, దానికి కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టు అని ముకేష్ సలహా ఇచ్చారని ఆనంద్ చెప్పుకొచ్చాడు.
కాగా ఆనంద్ ఈషాకు ప్రపోజ్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ముకేష్ పెద్ద కుమారుడైన ఆకాష్, కుమార్తె ఈషాలు కవలలని అందరికీ తెలిసిందే. అయితే కవలల్లో ఆకాశ్ కంటే ఈశానే పెద్దది. కొన్ని సెకన్ల ముందు ఆమె జన్మించిందట. అందువల్ల ఈషా వివాహం ముందు జరిపిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే కుటుంబవర్గాలు మాత్రం ఏ విషయాన్ని వెల్లడించలేదు. ఆకాశ్-శ్లోక, ఈషా-ఆనంద్ వివాహ తేదీలను అధికారికంగా ప్రకటిస్తేనే విషయం తెలుస్తుంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఆస్తుల మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్లకుపైగానే ఉంటుంది. ఆయన పెట్రోలియం, కెమికల్స్, పాలిమర్స్, పాలిస్టర్స్, టెక్స్టైల్స్, రిటైల్, డిజిటల్ సర్వీసెస్ తదితరాల వ్యాపారాలు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. ఇక పిరామల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరామల్ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.65,000 కోట్లకుపైగానే ఉంటుంది. ఫార్మా సొల్యూషన్స్, క్రిటికల్ కేర్, కన్జూమర్ ప్రోడక్ట్స్, ఫైనాన్స్, స్థిరాస్తి తదితర వ్యాపారాలు వారు నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా… వీరి వివాహాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ.. ఇప్పుడు వస్తున్న వార్తల కన్నా అప్పుడు మరింత రెట్టింపులో వార్తలు ఇంకా వైరల్ అయ్యేందుకు అవకాశం మాత్రం కచ్చితంగా ఉందనే చెప్పవచ్చు.