స్మార్ట్‌ఫోన్ల‌లో కొత్త‌గా వచ్చిన బోథీ అనే ఫీచ‌ర్ తెలిస్తే షాక‌వుతారు..!

నేటి త‌రుణంలో విడుద‌ల‌వుతున్న స్మార్ట్‌ఫోన్ల‌లో అనేక ఫీచ‌ర్లు ఉంటున్నాయి. వినియోగ‌దారుల అభిరుచుల మేర‌కు చాలా కంపెనీలు విభిన్న‌మైన ఫీచర్ల‌తో కూడిన ఫోన్ల‌ను రిలీజ్ చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ రోజూ ఏదో ఒక కొత్త ఫీచ‌ర్ ఫోన్ల‌లో వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే నోకియా తాజాగా విడుద‌ల చేసిన నోకియా 8లో ఓ కొత్త ఫీచ‌ర్‌ను ఇచ్చింది. దాని గురించి తెలిస్తే మీరు థ్రిల్ ఫీల‌వుతారు. ఎందుకంటే నిజంగా మీరు సెల్ఫీ ప్రియులే అయితే ఆ ఫీచ‌ర్ మీకు బాగా న‌చ్చుతుంది. అదే బోథీ (bothie). అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ, సెల్ఫీకి, బోథీకి తేడా ఏంటి..? అంటే, అవును ఉంది. అదేమిటంటే…

సాధార‌ణంగా స్మార్ట్‌ఫోన్ల‌లో మీరు కెమెరా యాప్‌ను ఉప‌యోగించి అయితే వెనుక కెమెరాతోనో లేదంటే ముందు కెమెరాతోనో ఫొటోలు తీస్తారు. వీడియోలు షూట్ చేసుకుంటారు. కానీ రెండు కెమెరాల‌ను ఒకేసారి ఉప‌యోగించ‌లేరు క‌దా. ఏదైనా ఒక కెమెరా మాత్ర‌మే ఎట్ ఎ టైం ప‌నిచేస్తుంది. అయితే నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కెమెరా యాప్ ద్వారా మీరు ఏక కాలంలో వెనుక‌, ముందు కెమెరాల‌ను ఉప‌యోగించి ఫొటోలు తీసుకోవ‌చ్చు, వీడియోలు షూట్ చేసుకోవ‌చ్చు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఈ ఫీచ‌ర్‌నే ప్ర‌స్తుతం పైన చెప్పిన బోథీ అని వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే నోకియా 8 ఫోన్‌లో డిఫాల్ట్‌గా దీన్ని అందించారు. కానీ మీరు మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో కూడా బోథీ ఫీచ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. కాక‌పోతే అందుకు మీరు ఈ యాప్‌ల‌లో ఏదైనా ఒక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. Frontback లేదా Front & Back Camera – Dual Selfie Camera Effect లేదా phoTWO అనే ఈ 3 యాప్స్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్నాయి. మొద‌టి యాప్ ఆండ్రాయిడ్‌, ఐఫోన్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తుండ‌గా, రెండో యాప్ కేవ‌లం ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ల‌భిస్తోంది. ఇక 3వ యాప్ కేవ‌లం ఐఫోన్‌లో మాత్ర‌మే ల‌భిస్తోంది. వీటిలో దేన్ని యూజ‌ర్లు వేసుకున్న దాంతో పైన చెప్పిన బోథీ ఫీచ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. ఇంకెందుకాల‌స్యం, వెంట‌నే మీరు బోథీలు తీసుకోండి..!

Comments

comments

Share this post

scroll to top