మీకు ఆర్థిక స‌మ‌స్య‌లున్నాయా..? అయితే ఈ వ‌స్తువుల‌పై ఓ లుక్కేయండి..!

ఇల్లు అన్నాక‌… అందులో మ‌నం ర‌క ర‌కాల వ‌స్తువులు పెట్టుకుంటాం. అయితే… అనుకోకుండానో లేదంటే మ‌రేదైనా ఇత‌ర కార‌ణాల వ‌ల్లో అప్పుడ‌ప్పుడూ కొన్ని వ‌స్తువులు ప‌గిలిపోతుంటాయి. కొన్ని ప‌నిచేయ‌కుండా పోతుంటాయి. అయినా మ‌నం వాటిని ప‌డేయ‌కుండా అలాగే పెట్టుకుంటాం. అయితే మీకు తెలుసా..? అలాంటి వ‌స్తువుల వ‌ల్ల మ‌న‌కు ఆర్థికంగా ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. ధ‌నం బాగా కోల్పోతామ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. జ్యోతిష్య శాస్త్రం దీని గురించి చెబుతోంది. ఈ క్ర‌మంలో మ‌నం ఇంట్లో ఆయా వ‌స్తువులను ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

money-things-1

దేవుడి చిత్ర‌ప‌టాలు, విగ్ర‌హాలు…
దేవుళ్లు, దేవ‌త‌ల‌కు చెందిన విగ్ర‌హాలు, చిత్ర‌ప‌టాల‌ను మ‌నం ఇంట్లో లెక్కకు మించి పెట్టుకుంటాం. అయితే ఏవి పెట్టుకున్నా వాటిని ఎదురెదుగా మాత్రం ఉంచ‌కూడ‌ద‌ట‌. లేదంటే అన్నీ ఆర్థిక స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌. డ‌బ్బులు బాగా ఖ‌ర్చయిపోతాయ‌ట‌. ఆదాయం త‌గ్గుతుంద‌ట‌.

ప‌గిలిన అద్దం…
ఇంట్లో ప‌గిలిన అద్దాలే కాదు, కిటికీ అద్దాలు ప‌గిలినా వాటిని వెంట‌నే మార్చేయాల‌ట‌. లేదంటే డ‌బ్బు ప‌రంగా అన్నీ ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ట‌. చేతిలో అస్స‌లు డ‌బ్బు నిల‌వ‌ద‌ట‌.

పగిలిన విగ్ర‌హం…
ఇంట్లో ప‌గిలిన దేవుడి విగ్ర‌హాలు లేదా చిరిగిన పోస్ట‌ర్లు ఉంచుకోరాదు. లేదంటే ఆర్థిక ప‌రంగా అన్నీ చిక్కులే ఎదుర‌వుతాయి. ఆదాయం త‌గ్గి ఖ‌ర్చులు పెరుగుతాయి.

ముళ్ల మొక్క‌లు…
ముళ్లు ఉండే మొక్క‌ల‌ను ఇంట్లో అస్స‌లు పెట్టుకోకూడ‌ద‌ట‌. అలా పెట్టుకుంటే ఇంట్లోని వారంద‌రికీ డ‌బ్బు స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌. డ‌బ్బు బాగా ఖ‌ర్చ‌వుతుంద‌ట‌.

ప‌నిచేయ‌ని ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు…
టీవీ, ఫ్రిజ్, కంప్యూట‌ర్‌… ఇలా ఇంట్లో ఉన్న ప‌నిచేయ‌ని ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను వెంట‌నే తీసేయాల‌ట‌. అలా చేయ‌క‌పోతే ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదురవుతాయి. డ‌బ్బు నిల‌వ‌దు.

ప‌నిచేయ‌ని గ‌డియారం…
ఇంట్లో ప‌నిచేయ‌ని గ‌డియారం పెట్టుకోకూడ‌ద‌ట‌. ఒక వేళ పెట్టుకుంటే ఆ ఇంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంద‌ట‌. దీంతో వారికి అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయ‌ట‌. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ట‌.

Comments

comments

Share this post

scroll to top