రూ.500, రూ.1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన కేంద్ర ప్ర‌భుత్వం… డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు వాటిని మార్చుకోవాలి..!

ఫ్లాష్‌… ఫ్లాష్‌… మీ వ‌ద్ద రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా..? అయితే వెంట‌నే వాటిని ఖ‌ర్చు పెట్టేయండి. లేదంటే వాటిని డిపాజిట్ చేసుకోండి. ఎందుకంటే కేంద్ర ప్ర‌భుత్వం ఆ నోట్ల‌ను నేటి నుంచి ర‌ద్దు చేసింది. అంటే నేటి అర్థ‌రాత్రి నుంచి ఆ నోట్ల‌ను ప్ర‌భుత్వం ముద్రించ‌డం లేదు. అంతేకాదు, ఇక‌పై మీరు ఆర్థిక లావాదేవీల‌ను ఇష్టం వ‌చ్చినట్టుగా నిర్వ‌హిస్తామంటే కుదర‌దు. అందుకూ ప్ర‌భుత్వం కొన్ని నిబంధ‌న‌ల‌ను ఏర్పాటు చేసింది. ప్ర‌ధాని మోడీ జాతినుద్దేశించి ప్ర‌సంగిస్తూ న‌ల్ల‌ధ‌నం నిరోధానికి, దొంగ‌నోట్ల‌ను అరిక‌ట్ట‌డానికి తమ ప్ర‌భుత్వం తీసుకోనున్న చ‌ర్య‌ల గురించి వివ‌రించారు. వాటిలోని సారాంశం ఇదే…

500-1000-note

  • నేడు అంటే 08.11.2016 అర్ధ‌రాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు ర‌ద్దు అవ‌నున్నాయి. ప్ర‌భుత్వం ఇక‌పై వాటిని ముద్రించ‌దు.
  • ఇప్ప‌టికే ఆయా నోట్లు ఉన్న‌వారు ఈ నెల 11 వ‌ర‌కు వాటిని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాల్లో త‌మ ఖ‌ర్చుల కోసం ఉప‌యోగించ‌వ‌చ్చు.
  • 11వ తేదీ దాటితే స‌ద‌రు నోట్ల‌ను ఎవ‌రూ తీసుకోరు. కానీ వాటిని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు.
  • అలా రూ.500, రూ.1000 నోట్ల‌ను డిపాజిట్ చేయించుకునేందుకు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవ‌సరం లేదు. అందుకు డిసెంబ‌ర్ 30వ తేదీని ఆఖ‌రి గ‌డువుగా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.
  • డిసెంబ‌ర్ 30 లోగా ప్ర‌జ‌లంద‌రూ త‌మ వ‌ద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్ల‌ను క‌చ్చితంగా మార్చుకోవాలి. లేదంటే ఆ తేదీ త‌రువాత అవి చెల్లుబాటు కావు.
  • ఈ రోజు అర్థ‌రాత్రి నుంచి 3 రోజుల వ‌ర‌కు ఏటీఎంలు అన్నీ మూసి ఉంటాయి.
  • బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేస్తే అందుకు ఐడీ కార్డు త‌ప్ప‌నిస‌రి.
  • ఏ వ్య‌క్తి అయినా బ్యాంకు నుంచి రోజుకు రూ.10వేలు మాత్ర‌మే డ్రా చేసుకోగ‌లడు. అదే వారానికి అయితే రూ.20వేలు మాత్ర‌మే డ్రా చేసుకునేందుకు వీలుంటుంది.
  • త్వ‌ర‌లో రూ.2000 నోట్ల‌ను ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.
  • వీలైనంత వ‌ర‌కు క్యాష్‌లెస్ లావాదేవీల‌ను నిర్వ‌హించుకుంటేనే మంచిది.

Comments

comments

Share this post

scroll to top