“ఉగాది” లోపు ఈ 5 పనులు తప్పక చేయాలంట..! ఎందుకో తెలుసా..?

ఉగాది.. తెలుగు సంవ‌త్స‌రం ఆరంభ‌మ‌య్యే రోజు. తెలుగు వారంతా ఎంతో సంతోషంగా జ‌రుపుకునే పండుగ ఇది. ఆ రోజున ఉగాది ప‌చ్చ‌డి సేవించ‌డంతోపాటు ఏడాదిలో త‌మ‌కు ఎలాంటి ఫ‌లితాలు ఎదుర‌వుతాయో పంచాంగంలో తెలుసుకుంటారు. దాని ప్ర‌కారం త‌మ‌కు క‌లిగే న‌ష్టాల నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తారు. అయితే ఆ ప్ర‌య‌త్నాల‌కు తోడు కింద చెప్పిన విధంగా ప‌లు సూచ‌న‌లను ఉగాది లోపు పాటిస్తే దాంతో ఆ త‌రువాత ఏడాది మొత్తం ఎంతో శుభం క‌లుగుతుంది. ధ‌నం సిద్ధిస్తుంది. కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు క‌లుగుతాయి. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రావి ఆకులు
రావి ఆకును ఒక దాన్ని తెచ్చి శుభ్రంగా క‌డిగి దానిపై సింధూరంతో శ్రీ అని రాయాలి. అనంత‌రం దాన్ని దేవుడి ఎదుట పెట్టి పూజ చేయాలి. ఆ త‌రువాత ఆ ఆకును తీసుకుని మ‌గ‌వారు అయితే ప‌ర్సులో, ఆడ‌వారు అయితే హ్యాండ్ బ్యాగులో పెట్టుకోవాలి. దీంతో అంతా శుభమే క‌లుగుతుంది. అష్ట ఐశ్వ‌ర్యాలు సిద్ధిస్తాయి. ఏ ప‌ని త‌ల‌పెట్టినా అందులో విజ‌యం సాధిస్తారు. ఆక‌స్మిక ధ‌న లాభం క‌లుగుతుంది.

2. బియ్యం
ఒక కిలో బియ్యాన్ని శివాల‌యానికి తీసుకెళ్లి పూజ చేయాలి. అందులో నుంచి గుప్పెడు బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. ఇంట్లో డ‌బ్బులు ఉంచే చోట ఆ బియ్యాన్ని పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి.

3. ల‌క్ష్మీ పూజ
ఉగాది రోజున ల‌క్ష్మీ దేవిని, లక్ష్మీ యంత్రాన్ని పూజించాలి. మ‌రుస‌టి రోజున ఆ యంత్రాన్ని బీరువాలో పెట్టాలి. దీంతో ధ‌న‌లాభం క‌లుగుతుంది. ఇత‌ర స‌మ‌స్య‌లు పోతాయి. అంతా శుభమే క‌లుగుతుంది.

4. గాజులు
ల‌క్ష్మీ దేవి ఎదుట ఎర్ర గాజుల‌ను పెట్టి పూజ చేశాక మ‌హిళ‌లు వాటిని ధ‌రించాలి. దీంతో కుటుంబంలో ఉండే వారంద‌రికీ మంచి జ‌రుగుతుంది. ధ‌నలాభం క‌లుగుతుంది.

5. గ‌వ్వ‌లు
ప‌సుపు రంగు గ‌వ్వ‌లు తెచ్చి వాటిలో పూజ గదిలో ల‌క్ష్మీదేవి ఎదుట పూజ చేశాక అనంత‌రం వాటిని డ‌బ్బులు ఉంచే చోట పెట్టాలి. లేదంటే తెలుపు రంగు గ‌వ్వ‌ల‌ను తెచ్చి వాటిని ప‌సుపు నీళ్ల‌లో వేసి ప‌సుపు రంగులోకి తెచ్చాక వాటితో పూజ చేసి వాటిని డ‌బ్బులు ఉంచే చోట పెట్ట‌వ‌చ్చు. ఇలా చేస్తే ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. మిక్కిలిగా సంప‌ద క‌లుగుతుంది. ఐశ్వ‌ర్యవంతులు అవుతారు. ఆరోగ్యం కలుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top