ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే…3 శ్వాస వ్యాయామాలు.

మ‌న శ‌రీరంలో నిర్దిష్ట‌మైన అవ‌యవాలు క‌లిసి ఒకే ప్రాంతంలో ఉంటాయి క‌దా. ఉదాహ‌ర‌ణ‌కు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం వంటివి ఉరః పంజ‌రంలో ఎముకల కింద ఉంటాయి. అదే త‌ల‌లో మెద‌డు, నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌, బ‌య‌ట‌కు కళ్లు, చెవులు, ముక్కు, నోరు వంటివి ఉంటాయి. ఇవి కాక పెల్విక్ (దీన్నే క‌టి అని తెలుగులో అంటారు) భాగానికి వ‌స్తే… అక్క‌డ పిరుదులు, మూత్రాశ‌యం, స్త్రీల‌లో అయితే గ‌ర్భాశ‌యం వంటివి ఉంటాయి. ఈ క్ర‌మంలో వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అందుకు ఏం చేయాలో తెలుసా..? ఎలాంటి వ్యాయామంతో ప‌ని లేకుండా కేవ‌లం కొన్ని బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తే చాలు. దాంతో క‌టి భాగం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ భాగంలో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు కూడా. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

pelvic-diaphram

rib-breathing
రిబ్ బ్రీతింగ్‌…
చిత్ర‌లో చూపిన‌ట్టుగా రిబ్ బ్రీతింగ్ చేస్తే దాంతో క‌టి సమ‌స్య‌లు పోతాయి. అయితే అందుకు ఏం చేయాలంటే మీరు శ్వాస తీసుకునేట‌ప్పుడు రెండు చేతుల‌ను ఊపిరితిత్తుల కిందుగా ఉంచాలి. అనంత‌రం శ్వాస తీసుకుని నెమ్మ‌దిగా వ‌దలాలి. ఇలా రోజూ ఉద‌యం, సాయంత్రం క‌నీసం 5 సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది. అయితే ఈ రిబ్ బ్రీతింగ్ ప్ర‌క్రియ‌లో ఊపిరితిత్తులు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి.

chest-breathing
చెస్ట్ బ్రీతింగ్‌…
ఈ విధానంలో శ్వాస తీసుకునేట‌ప్పుడు రెండు భుజాల‌ను ఒకేసారి పైకి లేపాలి. అనంత‌రం గాలిని వ‌దులుతూ భుజాల‌ను కింద‌కు దింపాలి. దీన్ని కూడా పైన చెప్పిన విధంగా ఉద‌యం, సాయంత్రం ప్రాక్టీస్ చేయాలి.

kapal-bhati
డ‌యాఫ్రం బ్రీతింగ్‌…
దీన్నే బెల్లీ బ్రీతింగ్ అని కూడా అంటారు. ప్రాణాయామంలో యోగా గురువు బాబా రాం దేవ్ చెబుతారు క‌దా… అదేనండీ… క‌పాల‌భ‌తి అని… అదే ఇది. పొట్ట‌తో శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకున్న‌ప్పుడు పొట్ట నింపాలి. వ‌దిలేట‌ప్పుడు బ‌లంగా గాలిని బ‌య‌ట‌కు వ‌ద‌లాలి. దీంతో పొట్ట ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు, లోప‌లికి వెళ్తుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌టి స‌మ‌స్య‌లే కాదు, ఇంకా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా పోతాయి. అయితే పైన చెప్పిన రెండు వ్యాయామాల క‌న్నా ఇది కొంచెం క‌ష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త‌గా దీన్ని చేసే వారికి క‌డుపు నొప్పి స‌మ‌స్య క‌లుగుతుంది. క‌నుక ప్రారంభంలో ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా 2 నిమిషాల పాటు చేయ‌డం మొద‌లు పెట్టి అనంత‌రం అవ‌స‌రం అనుకుంటే దీన్ని 30 నిమిషాల పాటు చేయ‌వ‌చ్చు కూడా. అయితే అలా చేయాలంటే కొద్ది రోజులు శ్ర‌మ‌ప‌డాలి. అయినా దీంతో చాలా మంచి ఫ‌లితాలే ఉంటాయి క‌నుక నిర్భ‌యంగా ఈ విధానాన్ని అవ‌లంబించ‌వ‌చ్చు.. !

Comments

comments

Share this post

scroll to top