పొట్ట తగ్గించుకునేందుకు…ఈ భంగిమ చాలా ఉపయోగకరం.

శ‌రీర బ‌రువు ఉండాల్సిన దానిక‌న్నా అధికంగా ఉంటే దాంతో ఎన్ని ఇబ్బందులు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దానికి తోడు ఇక పొట్ట కూడా ఎక్కువ‌గా ఉంద‌నుకోండి, ఇక బాధ చెప్ప‌న‌ల‌వి కాదు. మానసికంగానే కాదు, అటు శారీర‌కంగా కూడా ఎన్నో అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు పొంచి ఉంటాయి. అయితే అధిక బ‌రువును, పొట్ట‌ను త‌గ్గించుకునేందుకు అంద‌రూ వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. ఈ క్రమంలో వాటితోపాటు కింద సూచించిన విధంగా ఓ సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ 4 నిమిషాల పాటు చేస్తే చాలు. శ‌రీరంలో అధికంగా ఉన్న బ‌రువు, కొవ్వు క‌రిగిపోతుంది. అంతేకాదు, పొట్ట తొంద‌ర‌గా త‌గ్గుతుంది.

plank-exercise

చిత్రంలో చూపిన విధంగా నేల‌పై బోర్లా ప‌డుకుని మోచేతుల‌ను, కాలి వేళ్ల‌ను ఆధారంగా చేసుకుని శ‌రీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట‌, ఛాతీ కండ‌రాలు, భుజాల‌పై అధికంగా ఒత్తిడి ప‌డుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఈ వ్యాయామాన్ని ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ (Plank Exercise) అంటారు. దీన్ని నిత్యం కింద సూచించిన విధంగా చేస్తే కేవ‌లం 28 రోజుల్లోనే పొట్ట త‌గ్గుతుంది.

plank-exercise

కింద సూచించిన టైం ప్ర‌కారం పైన చెప్పిన భంగిమ‌లో రోజూ ఉండాలి…
మొద‌టి రోజు – 20 సెకండ్లు
రెండో రోజు – 20 సెకండ్లు
3వ రోజు – 30 సెకండ్లు
4వ రోజు – 30 సెకండ్లు
5వ రోజు – 40 సెకండ్లు
6వ రోజు – రెస్ట్
7వ రోజు – 45 సెకండ్లు
8వ రోజు – 45 సెకండ్లు
9వ రోజు – 60 సెకండ్లు
10వ రోజు – 60 సెకండ్లు
11వ రోజు – సెకండ్లు
12వ రోజు – 90 సెకండ్లు
13వ రోజు – రెస్ట్
14వ రోజు – 90 సెకండ్లు
15వ రోజు – 90 సెకండ్లు
16వ రోజు – 120 సెకండ్లు
17వ రోజు – 120 సెకండ్లు
18వ రోజు – 150 సెకండ్లు
19వ రోజు – రెస్ట్
20వ రోజు – 150 సెకండ్లు
21వ రోజు – 150 సెకండ్లు
22వ రోజు – 180 సెకండ్లు
23వ రోజు – 180 సెకండ్లు
24వ రోజు – 210 సెకండ్లు
25వ రోజు – రెస్ట్
26వ రోజు – 210 సెకండ్లు
27వ రోజు – 240 సెకండ్లు
28వ రోజు – 240 సెకండ్లు ఆపైన మీ ఇష్టం

పైన సూచించిన విధంగా రోజూ ఆయా స‌మయాన్ని అనుస‌రించి ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ చేస్తే ఫ‌లితం ఉంటుంది. త్వ‌ర‌గా పొట్ట త‌గ్గుతుంది.

Comments

comments

Share this post

scroll to top