సెలబ్రిటీ అయితే అలా చేయోచ్చా? ఆమె పై మండి పడుతున్న ఫ్యాన్స్!!

ఎవరికైన స్టార్ డమ్ వచ్చినప్పుడు ఎలా ఉపయోగించుకొవాలో అలానే ఉపయోగించుకొవాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పడానికి ఈ చిన్న విషయం ఉదాహారణగా చెప్పవచ్చు. మెంటల్ మదిలో’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హిరోయిన్నివేథా పేతురాజ్. ఈ ఆమ్మడు ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో ‘చిత్ర లహరి’, శ్రీవిష్ణుతో ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల్లో నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుంది.

అదేమిటంటే…

తమిళనాడులోని మదురై మీనాక్షి ఆలయంలో సెల్ ఫోన్ల వాడకాన్ని మద్రాస్ హైకోర్టు నిషేధిస్తున్నట్టు మదురై బెంచ్ తీర్పు ఇచ్చింది. కోర్టు సూచనల మేరకు నిర్వహణ అధికారులు ఫిబ్రవరి 2018 నుంచి ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్లవాడకాన్ని నిషేధించారు. ఇవేవి పట్టించుకోని పేతు తన స్నేహితురాలితో కలిసి మదురై మీనాక్షి ఆలయానికి వెళ్లింది. పనిలో పనిగా అక్కడ తన సెల్ ఫోన్లో తన స్నేహితురాలితో కలిసి ఫోటోలు దిగింది. దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే ఆమెని ఫోన్ తో ఆలయంలో ఎలా అనుమతించారు? సెలబ్రిటీ అయితే ¹¥ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తారా అంటూ పేతు పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఆలయంలో ఫోటోలు దిగడం నిషేధం అని మీకు తెలియదా? అంటూ ఆమె ఫాలోవర్స్ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆలయ అధికారులు కూడా సెలబ్రిటీలకు వంత పాడుతున్నారని సామాన్య భక్తులకు మాత్రం అన్ని రూల్స్ ఉంటాయని ఆలయ నిర్వాహకులపై కూడా సీరియస్ అవుతున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top