కొత్త రూల్: జంప్ అవ్వడమే కాదు…ఇకపై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అలా చేసినా కూడా 1000 ఫైన్.! ఎందుకో తెలుసా?

ట్రాఫిక్ సిగ్న‌ల్ ద‌గ్గ‌ర కారు ఆగిందంటే చాలు.. బిచ్చ‌గాళ్లు ప‌రిగెత్తుకుని వ‌స్తారు. ఎవ‌రో ఒక‌రు ఎంతో కొంత దానం చేయ‌క‌పోతారా అని ఆశ‌గా ఎదురు చూస్తారు. ఇక కొంద‌రు అయితే కార్ అద్దాల‌కు షీట్లు, బొమ్మ‌లు త‌దిత‌ర వ‌స్తువుల‌ను సిగ్న‌ల్స్ వ‌ద్ద అమ్ముకుంటారు. అయితే ఇక‌పై వీరు అలా చేసేందుకు వీలు లేదు. అంటే.. కార్ల‌ను న‌డిపేవారు ఎవ‌రైనా ఇకపై ట్రాఫిక్ సిగ్న‌ల్స్ వ‌ద్ద కార్ విండోల‌ను తీయ‌కూడ‌దు. తీస్తే రూ.1000 ఫైన్ ప‌డుతుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఏంటీ.. రూల్ భ‌లే వింత‌గా ఉందే. కార్ విండోను సిగ్న‌ల్ వ‌ద్ద ఎందుకు ఓపెన్ చేయ‌కూడ‌దు ? చేస్తే ఏమ‌వుతుంది ? అనే క‌దా మీ డౌట్‌. అయితే అందుకు స‌మాధానం మీరే కింద చ‌దివి తెలుసుకోండి.

ట్రాఫిక్ సిగ్న‌ల్స్ వ‌ద్ద కారు యాక్ససరీలు, ఇత‌ర బొమ్మ‌లు వ‌స్తువులు కొనుగోలు చేసేందుకు కార్ విండో ఓపెన్ చేస్తున్నారా ? బెగ్గర్స్ కి దానం చేద్దామని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మీ కారు విండో ఓపెన్ చేస్తున్నారా ? అయితే ఇకపై మీరు అలా చేయ‌రాదు. చేస్తే రూ.1000 ఫైన్ వేస్తారు. వినేందుకు వింత‌గా ఉన్నా ఈ నిబంధ‌న‌ను ఇప్పుడు కొత్త‌గా ఏమీ ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. ఎప్ప‌టి నుంచో ఈ రూల్ ఉంది. ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద ఉన్న‌ప్పుడు కారు విండోను ఓపెన్ చేయ‌రాద‌ట‌.

ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద ఉన్న‌ప్పుడు కారు విండోను ఓపెన్ చేస్తే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రూ.1000 స్పాట్ ఫైన్ లేదా కోర్టు చలానా కూడా విధిస్తారు. ఎప్పటి నుండో ఈ రూల్‌ ఉన్నప్పటికీ చాలా మంది వాహ‌న‌దారులకు వీటి గురించి అవగాహన లేదు. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్రభుత్వం త్వ‌ర‌లో ఈ రూల్‌పై కొత్త‌గా నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నుంది. వాహనదారులను శిక్షించాలన్నది తమ ఉద్దేశం కాదని, ట్రాఫిక్ ఉల్లంఘన చట్టాలపై అవగాహన కల్పించడం కోసమే ఈ రూల్‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ త‌ర‌హా పెనాల్టీల‌ను విధించడం జ‌రుగుతుంద‌ని, త‌ద్వారా వాహ‌న‌దారుల‌కు చట్టాలపై అవగాహన కల్పిస్తామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ చీఫ్, స్పెషల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర పతక్ తెలిపారు. మ‌రి.. మ‌న ద‌గ్గ‌ర ఈ రూల్ ఎప్పుడు అమ‌లులోకి వ‌స్తుందో చూడాలిక‌..!

Comments

comments

Share this post

scroll to top