రూ.2వేల నోట్ల‌ను దాచుకోకండి. వాటిని కూడా ర‌ద్దు చేస్తార‌ట తెలుసా.!? మరి 500 ..?

రూ.500, రూ.1వేయి పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్పుడు జ‌నాలు ఏ విధంగా ఇబ్బందులు ప‌డ్డారో అంద‌రికీ తెలిసిందే. ఓ వైపు న‌గ‌దు ల‌భించ‌క‌, మ‌రోవైపు ఉన్న రూ.2వేల నోట్ల‌కు చిల్ల‌ర లేక‌, ఇంకో వైపు నోట్ల మార్పిడి, డిపాజిట్ వంటి స‌మ‌స్య‌ల‌తో నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు. బ్లాక్ మ‌నీని వెలికి తీయ‌డం కోసం, డిజిట‌ల్ లావాదేవీలు పెంచ‌డం కోసం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేశామ‌ని ప్ర‌ధాని మోడీ చెప్పారు. అయితే నిజానికి ఆ ల‌క్ష్యం నెర‌వేరిందో లేదో తెలియ‌దు కానీ, ఇప్ప‌టికీ ప్ర‌తి నెలా మొద‌టి రెండు వారాల్లో న‌గదు కోసం జ‌నాలు ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే జ‌నాల నెత్తిన మ‌రో బాంబ్ ప‌డ‌నుందా..? అంటే అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఎందుకో తెలుసా..?

ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆర్‌బీఐ రూ.2వేల నోట్ల‌ను ముద్రించ‌లేదు. ఇప్ప‌టికే ఈ నోట్ల ముద్ర‌ణ‌ను ఆపేసింద‌ట‌. ఎందుకంటే రూ.500, రూ.2వేల నోట్లు వ‌చ్చిన‌వి వ‌చ్చిన‌ట్టుగా కొంద‌రి వ‌ద్ద బ్లాక్ అయిపోతున్నాయ‌ని, అవి మ‌ళ్లీ చెలామ‌ణీలోకి రావ‌డం లేద‌ని ఆర్‌బీఐ గుర్తించింది. నోట్ల రద్దుకు ముందు రూ.500 నోట్ల చెలామణి 47.85శాతంగా ఉంటే, నోట్ల రద్దు తర్వాత 43.60 శాతంగా ఉంది. రద్దుకు ముందు రూ.1వేయి నోట్ల చెలామణి 38.54 శాతంగా ఉంటే, ఇప్పుడు రూ.2వేల నోట్ల చెలామణి కేవలం 28.80శాతంగా మాత్రమే ఉంది. అప్పట్లో వంద నోట్ల చెలామణి 9.61శాతంగా ఉంటే, ఇప్పుడు అది 20.30శాతంగా ఉంది. అంటే నోట్ల రద్దు తర్వాత 2000, 500 నోట్ల సర్క్యులేషన్ భారీగా తగ్గిపోయింద‌ని, రూ.100, 50, 20, 10 రూపాయల నోట్ల చెలామణిలో ఏడు శాతం పెరుగుదల కనిపించిందని ఆర్‌బీఐ గుర్తించింది. దీన్ని బ‌ట్టి తెలిసిందేమిటంటే… పెద్ద నోట్లయిన రూ.500, రూ.2వేల నోట్లు మ‌ళ్లీ మొత్తం బ్లాక్ అవుతున్న‌ట్టు ఆర్‌బీఐ గుర్తించింది. దీంతో ప్ర‌స్తుతం రూ.2వేల నోట్ల ముద్ర‌ణ‌ను ఆపేసింది.

అయితే మ‌రి రూ.2వేల నోట్ల ముద్ర‌ణ‌ను ఆపేస్తే ఎలా..? జ‌నాల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయి క‌దా..? అంటే అవును, ఎదుర‌వుతాయి. అయితే వాటిని తీర్చ‌డం కోసం ఆర్‌బీఐ ఇప్పుడు రూ.200 నోట్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. అయితే ఇవి ఎంత మందికి స‌రిపోతాయో తెలియ‌దు. ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున బ్లాక్ అవుతున్న రూ.2వేల నోట్ల‌ను కూడా ఆర్‌బీఐ ర‌ద్దు చేస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మీరు ఈ నోట్ల‌ను ఎక్కువ మొత్తంలో ఉంచుకోక‌పోవ‌డ‌మే బెట‌ర్‌. వీలైనంత వ‌ర‌కు డిజిట‌ల్ చెల్లింపులు చేయ‌డం సేఫ్‌..!

Comments

comments

Share this post

scroll to top