దసరా నవ రాత్రుల్లో “హెయిర్ కట్” చేయించొద్దు.అంతే కాకుండా ఈ 7 తప్పులు చేయొద్దు..ఎందుకో తెలుసా?

AP2TG Staff

ఎప్ప‌టిలాగే ఈ ఏడాది కూడా ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. అవి ముగిశాక ద‌స‌రా పండుగ‌ను ప్ర‌జ‌లు జ‌రుపుకుంటారు. 9 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఉత్స‌వాల్లో భాగంగా కొంద‌రు దుర్గామాత విగ్ర‌హాల‌ను కూడా పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మీకు తెలుసా..? ఈ 9 రోజుల పాటు.. అంటే న‌వ‌రాత్రులు జ‌రిగిన‌న్ని రోజులు మ‌నం కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో, వాటి వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హెయిర్ క‌ట్:

న‌వ‌రాత్రుల్లో ఎవ‌రూ హెయిర్ క‌ట్ చేయించుకోకూడ‌ద‌ట‌. అలాగే గుండు చేయించుకోవ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను కూడా పెట్టుకోకూడ‌ద‌ట‌. ఎందుకంటే అలా చేస్తే దుర్గా దేవి ఆగ్ర‌హిస్తుంద‌ట‌. దీంతో భ‌క్తుల‌కు క‌ష్టాలు ఎదుర‌వుతాయి.

2. క‌ల‌శం:

ఇంట్లో దుర్గాదేవికి పూజ చేసేట‌ప్పుడు దేవి ఎదుట క‌ల‌శం ఉంచాలి. అలాగే దేవి ఎదుట అఖండ జ్యోతి వెలిగించాలి. అది 9 రోజుల పాటు ఆరిపోకుండా చూడాలి. ఇక ఇంట్లో 9 రోజుల పాటు క‌చ్చితంగా ఎవ‌రో ఒక‌రు ఉండాలి. అంతేకానీ ఎవ‌రూ లేకుండా ఇంటికి తాళం పెట్టరాదు. అలా చేయ‌డం వ‌ల్ల దేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ట‌.

3. నిమ్మ‌కాయ:

న‌వ‌రాత్రులు జ‌రిగిన‌న్ని రోజులు ఇంట్లో నిమ్మ‌కాయ‌ను కోయ‌రాద‌ట‌. అలా చేస్తే అరిష్టం క‌లుగుతుంద‌ట‌. కానీ మ‌రి నిమ్మ‌ర‌సం లేక‌పోతే ఎలా.. అంటే అందుకు ప‌రిష్కారం ఉంది. మార్కెట్‌లో దొరికే నిమ్మ‌ర‌సం బాటిల్స్‌ను వాడ‌వ‌చ్చు.

4. నిద్ర:

న‌వ‌రాత్రుల పాటు రోజూ ఉప‌వాసం ఉండే వారు మ‌ధ్యాహ్నం పూట అస్స‌లు నిద్ర‌పోరాదు. పోతే పూజ‌లు చేసినా ఫ‌లితం ఉండ‌దు.

5. ఉప‌వాసం:

న‌వ‌రాత్రుల్లో రోజూ ఉప‌వాసం చేసే వారు కొద్ది మొత్తంలో పండ్ల‌ను ఆక‌లి అనిపించిన‌ప్పుడు తిన‌వ‌చ్చు.

6. జ‌లం:

న‌వ‌రాత్రి రోజుల్లో నీటిని బాగా తాగాలి. దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ క‌లుగుతుంది. ఉప‌వాసం ఉన్నా ఆక‌లి అనిపించ‌దు.

7. కూర‌గాయ‌లు:

ఉప‌వాసం చేసేట‌ప్పుడు ఆలుగ‌డ్డ‌లు త‌ప్ప ఇత‌ర ఏ కూర‌గాయ‌ల‌ను తిన‌రాదు. వాటిని కూడా ఉడ‌క‌బెట్టుకుని అలాగే తిన‌వ‌చ్చు. కానీ కూర‌లా చేసి తిన‌రాదు.

8. ఆహారం :

ఉప‌వాసం చేయ‌ని వారు పాల‌ను కూర‌గాయ‌ల‌తో క‌లిపి వండి తింటే చాలా మేలు జ‌రుగుతుంది.

9. తిను బండారాలు:

న‌వ‌రాత్రుల్లో ఉప‌వాసం చేయ‌ని వారు రోటీ, పూరీ, ప‌కోడీ తినాలి.

10. సామ అన్నం:

సామ‌లు అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన తృణ‌ధాన్యం మ‌న‌కు మార్కెట్‌లో దొరుకుతుంది. దాంతో అన్నం వండి తినాలి.

11. న‌ట్స్ :

ఫాక్స్ న‌ట్స్ అని పిల‌వ‌బ‌డే న‌ట్స్‌ను రోస్ట్ చేయాలి. అందులో నెయ్యి వేసుకుని తిన‌వ‌చ్చు.

12. చ‌క్కెర‌:

న‌వ‌రాత్రి వంట‌కాల్లో చ‌క్కెర‌ను వాడ‌రాదు. బెల్లం లేదా తేనె వాడ‌వ‌చ్చు.

Comments

comments