ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను తిన‌రాద‌ట తెలుసా..? తింటే ఏమ‌వుతుందంటే..?

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మ‌నంద‌రికీ తెలిసిందే. వాటి వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి. కాల్షియం అందుతుంది. దీంతో ఎముక‌లు బలంగా మారుతాయి. అయితే కోడిగుడ్ల విష‌యంలో చాలా మంది చేసే పొర‌పాటు ఒక‌టుంది. అదేమిటంటే… గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడ‌తారు. ఒకేసారి ఎక్కువ గుడ్లు కొంటే వాటిని నిల్వ చేయ‌డం కోసం, ఫ్రిజ్‌లో పెడితే పాడ‌వ‌వు అనే ఉద్దేశంతో చాలా మంది గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడ‌తారు. అయితే నిజానికి ఇలా చేయ‌కూడ‌దట తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అంతేకాదు, అలా ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను కూడా అస్స‌లు తిన‌రాద‌ట‌. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

సాధార‌ణంగా గుడ్ల‌ను మార్కెట్ నుంచి తెచ్చిన వెంట‌నే 1, 2 రోజుల్లో వాడేయాలి. లేదంటే అవి పాడ‌వుతాయి. ఇక వాటిని ఫ్రిజ్‌లో పెడితే బాగుంటాయ‌ని కొంద‌రు అనుకుంటారు. కానీ అది ఎంత మాత్రం క‌రెక్ట్ కాదు. ఎందుకంటే గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడితే అవి త్వ‌ర‌గా పాడ‌వుతాయ‌ట‌. త్వ‌ర‌గా కుళ్లిపోతాయ‌ట‌. దీంతోపాటు ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల పెంకుల‌పై బాక్టీరియా పెద్ద మొత్తంలో చేరుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో అలాంటి గుడ్ల‌ను తింటే అనారోగ్యాల బారిన ప‌డ‌తామ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

ఫ్రిజ్ లో పెట్టిన గుడ్ల‌ను తినొద్ద‌ని చెప్ప‌డానికి గ‌ల మ‌రో కార‌ణం.. వాటి రుచి. అవును, అదే. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్లు త‌మ స‌హ‌జ‌సిద్ధ‌మైన‌ రుచిని కోల్పోతాయి. పుల్ల‌గా మారుతాయి. దీనికి తోడు వాటిలో ఉండే పోష‌కాలు కూడా న‌శిస్తాయ‌ట‌. క‌నుక ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను తిన‌రాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అస‌లు గుడ్ల‌ను తేగానే 1, 2 రోజుల్లో వాడుకోవ‌డ‌మే బెటర్ అని, బ‌య‌ట అయిన‌ప్ప‌టికీ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచ‌కూడ‌ద‌ని సైంటిస్టులు అంటున్నారు. కాబట్టి జాగ్ర‌త్త‌… ఇక‌పై మీరు గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌కండి. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను తిన‌కండి. లేదంలే అనారోగ్యం బారిన ప‌డితే ఆపై బాధ‌ప‌డీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

Comments

comments

Share this post

scroll to top