ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌య్యేవారు చేయ‌కూడ‌ని 4 ముఖ్య‌మైన మిస్టేక్స్ ఇవే తెలుసా..?

నిరుద్యోగుల‌కు ఎవ‌రికైనా ఏ కంపెనీలో అయినా జాబ్ దొర‌కాలంటే క‌ష్ట‌మే. ముందు జాబ్ ఇంట‌ర్వ్యూకు పిలుపు రావాలి. త‌రువాత ఇంట‌ర్వ్యూకు అటెండ్ అవ్వాలి. అందులో ఎంపిక అవ‌డం మ‌రొక స‌వాల్‌. ఇన్ని క‌ష్ట‌త‌ర‌మైన స‌వాళ్ల‌ను దాటుకుంటూ ముందుకు సాగితే కానీ ఎవ‌రికీ అంత ఈజీగా ఏ జాబ్ ద‌క్క‌దు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ కొంద‌రు మాత్రం ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో తేలిపోతుంటారు. ఇంట‌ర్వ్యూ చేసే వారిని బోల్తా కొట్టించాల‌ని, ఎలాగైనా జాబ్ పొందాల‌నే ఆశ‌తో త‌ప్పుడు ఆన్స‌ర్లు చెబుతారు. దీంతో దొరికిపోతారు. అలా చాలా మంది ఇంట‌ర్వ్యూల్లో ఫెయిల్ అవుతుంటారు. అలాంటి వారు ఇంట‌ర్వ్యూల‌లో చేయ‌కూడ‌ని కొన్ని త‌ప్పుల‌ను కింద తెలియ‌జేస్తున్నాం. వాటిని ఫాలో అయితే ఇంట‌ర్వ్యూల‌లో వారు సెలెక్ట్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆ అభ్య‌ర్థులు చేయ‌కూడ‌ని ఆ త‌ప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఇంట‌ర్వ్యూల‌లో చాలా మంది నిజాయితీగా ఉండ‌రు. ఇంట‌ర్వ్యూయ‌ర్‌కు ఏం తెలుస్తుందిలే అని అనుకుని తప్పు స‌మాధానాలు చెబుతుంటారు. కానీ అలా చేయ‌రాదు. నిజాయితీగా ఉండాలి. ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలిస్తే చెప్పాలి. లేదంటే లేదు. అంతేకానీ త‌ప్పుడు స‌మాధానాలు చెప్ప‌రాదు. అలాగే అభ్య‌ర్థులు త‌మ‌కున్న వీక్‌నెస్‌ల‌ను నిజాయితీగా ఒప్పుకోవాలి. తాము ఏ ప‌రిస్థితుల్లో ప‌నిచేయ‌గలుగుతాం, ఏ ప‌రిస్థితుల్లో ప‌నిచేయ‌లేమో ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు వివ‌రించాలి. దీంతో వారికి అభ్య‌ర్థుల్లో దాగి ఉన్న నిజాయితీ తెలుస్తుంది. ఫ‌లితంగా అందుకు ఇంట‌ర్వ్యూయ‌ర్లు ఇంప్రెస్ అవుతారు. అభ్య‌ర్థిలో ఉన్న నిజాయితీ ప‌ట్ల ఇంప్రెస్ అయి వారికి జాబ్ ఇస్తారు.

2. కొంద‌రు అభ్య‌ర్థులు ఇంట‌ర్వ్యూల్లో తాము ప‌నిచేసిన పాత కంపెనీ గురించి లేదా అక్క‌డ ప‌నిచేస్తున్న ఉద్యోగుల గురించి చెడుగా ఇంట‌ర్వ్యూల్లో ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు చెబుతారు. అలా చేయ‌రాదు. అలా చేస్తే అభ్య‌ర్థుల‌పై ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు బ్యాడ్ ఒపినియ‌న్ ఏర్ప‌డుతుంది. దాంతో జాబ్ రాక‌పోవ‌చ్చు.

3. ఇంట‌ర్వ్యూల్లో అభ్య‌ర్థులు చేసే మ‌రో పొర‌పాటు.. తాము వేరే ఏ ఇత‌ర కంపెనీలలో జాబ్ కోసం అప్లై చేయ‌లేద‌ని, నేరుగా ఆ కంపెనీకే వ‌చ్చామ‌ని చెబుతారు. ఇలా చేయ‌రాదు. నిజంగా అభ్య‌ర్థులు ఏ కంపెనీలోనూ జాబ్ కోసం అప్లై చేయ‌క‌పోతే చేయ‌లేద‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ నేటి త‌రుణంలో ఇలాంటి మాట‌లు చెబితే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఎందుకంటే ఎవ‌రూ కూడా కేవ‌లం ఒక్క కంపెనీలోనే జాబ్ కోసం అప్లై చేయ‌రు క‌దా. అనేక కంపెనీల్లో జాబ్ కోసం ద‌ర‌ఖాస్తులు పెట్టుకుంటారు. క‌నుక అభ్య‌ర్థులు ఎవ‌రైనా తాము ఎన్ని కంపెనీల‌కు జాబ్ అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు చెబితే దాంతో అభ్య‌ర్థుల్లో ఉన్న క‌ష్ట‌ప‌డేతత్వం గురించి ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు తెలుస్తుంది. ఫ‌లితంగా జాబ్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

4. కొంద‌రు ఇంట‌ర్వ్యూలో ఎంపిక కాగానే వెంటనే ఏదో అర్జెంటు ప‌ని ఉంద‌ని చెప్పి ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌ను లీవ్ అడుగుతారు. అలా చేయ‌రాదు. కొత్త జాబ్‌లో చేరాక కొద్ది రోజులు పోయాక లీవ్ అడ‌గ‌వచ్చు. క‌నుక లీవ్ గురించి ఇంట‌ర్వ్యూల్లో చ‌ర్చించ‌రాదు.

https://www.scoopwhoop.com/things-not-to-do-in-a-job-interview/?ref=latest&utm_source=home_latest&utm_medium=desktop#.m9bp8dxm0

Comments

comments

Share this post

scroll to top