ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే ముందు..అతను తెలివిగా ఎలాంటి ట్రిక్ ఫాలో అవుతాడో తెలుసా?

మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా బిచ్చగాళ్లు కామన్‌గా మనకు కనిపిస్తారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్ వద్ద, బస్టాండ్లలో, ఆలయాల వద్ద.. ప్రస్తుతం చిన్నపాటి హోటల్స్‌, కర్రీ పాయింట్ల వద్ద కూడా వారు ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో తిరిగే వారి దగ్గరకు బిచ్చగాళ్లు వచ్చి అడుక్కుంటూ ఉంటారు. ఈ క్రమంలో జాలి కలిగిన కొందరు వారికి డబ్బులు ఇస్తారు. కొందరికైతే అలా ఇవ్వడం నచ్చదు. వారు డబ్బులు లేవని పంపిస్తారు. మరి కొందరికి అసలు బిచ్చగాళ్లంటేనే పడదు. దీంతో వారు బిచ్చగాళ్లు దగ్గరికి వస్తే విసుక్కుంటారు. అయితే కొందరు మాత్రం బిచ్చగాళ్లకు దానం ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. ఇవ్వకపోతే బాగుండదేమో అనుకుంటారు. ఇస్తే.. ఛ.. అసలు అలాంటి వారికి ఎందుకు దానం చేశాం అని ఫీలవుతారు. అయితే ఇలాంటి వారు కింద చెప్పిన ఓ సూచన పాటిస్తే.. ఇక ఈ విషయంలో వారికి ఇకపై ఎలాంటి సందేహం రాదు. మరి ఆ సూచన ఏమిటంటే…

ఈసారి మీ వద్దకు ఎవరైనా బిచ్చగాడు వచ్చి అడుక్కుంటే మీకు తెలిసిన హోటల్‌ లేదా ఏదో ఒక దగ్గర పని ఉందని చెప్పండి. పని చేసుకుని బతుకుతావా ? అని అడగండి. అందుకు పదికి 8 మంది చేయలేం అని వెనక్కి వెళ్లిపోతారు. ఎవరో ఒకరో ఇద్దరో మాత్రమే చేస్తాం అని చెప్పి మనస్పూర్తి అంగీకారంతో ముందుకు వస్తారు. అప్పుడు ఏం చేయాలంటే…

అలా పనిచేస్తాం అని చెప్పి ముందుకు వచ్చే ఆ ఒక్కరో ఇద్దరికో మాత్రమే మీరు దానం ఇచ్చే డబ్బులు అక్కరకొస్తాయి. కనుక వారికి డబ్బులు ఇచ్చి పంపేయండి. పని గురించి అడిగితే ఇంకా మంచి పని చూసి పెడతా అని చెప్పండి. ఇక పని చేయలేం అనేవారు ఎలాగూ వెళ్లిపోతారు కాబట్టి వారికి డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. అలాంటి వారికి మనం చేసే దానం ఎలాగూ పనికిరాదు కనుక వారికి దానం చేయకపోయినా మనకు ఎలాంటి ఫీల్‌ కలగదు. కాబట్టి ఇకపై మీ వద్దకు దానం చేయమని ఎవరైనా బిచ్చగాళ్లు వస్తే.. పైన చెప్పిన విధంగా చేయండి. ఎలాంటి ఇబ్బంది కలగదు.

Comments

comments

Share this post

scroll to top