ఆ రైతు తన చేనుకి దిష్టి తగులుతుందని ఏం చేసాడో తెలుసా.? దిష్టి బొమ్మ ప్లేస్ ఎవరి ఫోటో అంటే.?

మన దేశంలో చాలా వరకు హిందువులే కాదు, పలు ఇతర వర్గాలకు చెందిన వారు కూడా దృష్టి ఉందని నమ్ముతారు. దృష్టి అంటే.. అదేనండీ.. మన వాళ్లు దిష్టి అంటారు కదా. అదే. దాన్నుంచి తప్పించుకునేందుకు అందరూ రక రకాల పద్ధతులు పాటిస్తారు. ఉప్పు, చెప్పులు, చీపురు వంటి వాటిని ఉపయోగించి దిష్టి తీస్తారు. కొందరు తాయెత్తులు కట్టుకుంటారు. ఇక కొందరు ఇండ్లలో, ఆఫీసుల్లో, షాపుల్లో దిష్టిబొమ్మలు వేలాడదీస్తారు. వాహనాలకైతే జీడిగింజలు, నిమ్మకాయలు, నల్లదారం కలిపి కడతారు. నేటి తరుణంలో చాలా మంది తమకు దిష్టి తగలకుండా ఉండేందుకు గాను ఎడమ కాలికి నల్లదారం కూడా కట్టుకుంటున్నారు. అయితే ఇవన్నీ దిష్టిని తగ్గించుకునేందుకు మనకు తెలిసిన పలు విధానాలే. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆ రైతు మాత్రం తన చేనుకు దిష్టి తగలకుండా దిష్టిబొమ్మను పెట్టలేదు. అందుకు బదులుగా అతను ఏం చేశాడో తెలుసా..? తెలిస్తే షాకవుతారు.

అది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బండ కింది పల్లె అనే ఓ మారుమూల గ్రామం. అక్కడ నివాసం ఉంటున్న చెంచు రెడ్డి అనే 45 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ రైతు తన చేనులో పంట వేశాడు. మొత్తం 10 ఎకరాల్లో పంట అద్భుతంగా పండింది. మంచి దిగుబడి రానుంది. అయితే ఆ చేను పక్కగా వెళ్లేవారందరూ చేనును చూసి ఆహో, ఓహో అంటూ పొగుడుతున్నారు. దీంతో వారి చూపు పడి తన చేనుకు, పంటకు దిష్టి తగులుతుందని అతను భావించాడు. అందుకు అతను ఏం చేశాడో తెలుసా..? తన చేను పక్కనే సన్నీలియోన్‌ ఫోటోను కట్టించాడు. ఏంటీ.. షాకయ్యారా.. అయినా ఇది నిజమే.

చెంచురెడ్డి తన చేనుకు దిష్టి తగలకుండా ఉండేందుకు గాను సన్నీ లియోన్‌ ఫొటో ఒకటి తీసుకుని దాంతో ఫ్లెక్సి చేయించాడు. అందులో సన్నీ లియోన్‌ ఫోటో ఉంటుంది. దాని పక్కనే ఒరేయ్‌.. నన్ను చూసి ఏడవకురా..! అనే వాక్యాన్ని కూడా రాయించాడు. దీంతో అటుగా వెళ్లేవారు తన చేనును ఇప్పుడు చూడడం లేదని, సన్నీ లియోన్‌ ఫొటోను చూసి వెళ్తున్నారని, కనుక తన చేనుకు దిష్టి తగలదని చెంచు రెడ్డి అంటున్నాడు. ఇక ఈ విషయమై ఓ మీడియా చానల్‌ అతన్ని వివరణ అడిగింది. సన్నీ లియోన్‌కు చెందిన అలాంటి అసభ్యకరమైన ఫొటోను పెడితే అధికారులు ఎవరైనా వచ్చి అభ్యంతరం వ్యక్తం చేస్తారేమో అన్న ప్రశ్న వేశారు. అందుకు చెంచు రెడ్డి ఏమన్నాడంటే.. తన పంట బాగాలేనప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారి వచ్చి తన సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, అలాంటిది ఇప్పుడు వారు వచ్చి ఈ ఫొటో పట్ల అభ్యంతరం ఎలా వ్యక్తం చేస్తారని అతను ఎదురు ప్రశ్నించాడు. అవును మరి, అసలు అధికారులు రైతుల సమస్యలను ఎప్పుడు పట్టించుకున్నారు గనక. ఏది ఏమైనా చెంచు రెడ్డి చేసిన ఆలోచన భలే విచిత్రంగా ఉంది కదా..!

Comments

comments

Share this post

scroll to top