ఉదయం అలారం మోగినప్పుడు..ఆపేసి మళ్లీ పడుకుంటున్నారా..? అయితే ఈ బాడీ-మైండ్ డిస్కషన్ మీకోసమే..!

(నిద్రపోవాలనుకున్నప్పుడు):

  • మనిషి: రేపు తొంద‌ర‌గా మేల్కొవాలి.!
  • మనసు: అవును మేల్కోవాలి.

(తెల్లవారుతున్నప్పుడు)

  • మనిషి: సమయం 4 గంటలూంది…,నిద్ర లేవాలి.
  • మనసు: నాకు ఇంకాస్త నిద్ర కావాలి.!
  • మనిషి: అవును …. కావాలి….గుర్ర్…గుర్ర్….గుర్ర్..!!!

(5 గంట‌ల‌కు).

  • మనిషి: మేలుకో..మేలుకో….
  • మనసు:వద్దు..వద్దు..
  • మనిషి: లేదు..నాకు 8 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవ‌డం ఇష్టం లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా టిఫిన్ చేయాలి, ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి, నా సమయాన్నిట్రాఫిక్ లో వృథా చేయను
  • మనసు: సరే..సరే,,, మేలుకో…!

చూశారా! మొద‌ట్లో మ‌నిషిని డ్యామినేట్ చేయాల‌ని చూసిన మ‌న‌సు , త‌ర్వాత కృత‌నిశ్చ‌యంతో ఉన్న మ‌నిషి మాట విన్నది.! ఒక‌వేళ ఈ సంద‌ర్భంలో…స‌రే అని మ‌న‌సు మాటే విన్న‌మానుకోండి మ‌న ప‌త‌నం అక్క‌డి నుండే స్టార్ట్ అవుతుంది.!! అంటే మనం మనసును స్వాధీనములో ఉంచుట‌కు…. సాకులకు బదులుగా సానుకూల సమాధానాలు చెప్పుకుని , సాధించాల్సిన విష‌యాల‌ను గురించి ప్ర‌స్తావించుకుంటూ మ‌న మ‌న‌స్సును కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి.! లేదంటే మాన‌వ జీవితం గ‌తి త‌ప్పుతుంది, మ‌న‌స్సు మ‌న‌ల్ని పిచ్చోల్లుగా చిత్రీక‌రిస్తుంది.! మాన‌వ సంక‌ల్పం ముందు ఎలాంటి ప‌వ‌ర్స్ అయినా దిగ‌దుడుపే.!!

Comments

comments

Share this post

scroll to top