హయత్ నగర్: చదువులా డిస్కౌంట్ వ్యాపారాలా.? స్కూల్ అడ్మిషన్లకి లక్కీడ్రా ఏంటి.? ప్రైజులు ఏంటంటే.?

ఒకప్పుడు చదువుకునేవారం..మరిప్పుడు చదువు”కొంటున్నాం”..విద్యా,వైధ్యం వ్యాపారం అయిపోయి పేదవాడికి అందని ద్రాక్షగా మారిన మాట వాస్తవమే కాని…మరీ విద్యను కూడా ఆకర్షణీయంగా వ్యాపారం చేయాలనుకోవడమే  శోచనీయం.ఏ స్కూల్ అయినా మా దగ్గర మంచి టీచర్లున్నారు,మంచి ఫెసిలీటీస్ ఉన్నాయి..మీ పిల్లల భవిష్యత్ కి బంగారు బాటు వేస్తాం లాంటి విషయాలు చెప్పేవారు ఒకప్పుడు.మరిప్పుడు చెప్పుల షాపులు,బట్టల షాపులు కిరాణా స్టోర్లు ఆఫర్లు ఇచ్చినట్టుగా స్కూల్స్ కూడా ఆఫర్స్ ప్రకటించి భరితెగించాయి..

ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్ చేసే వ్యాపారం తేటతెల్లమవుతుంటే, తాము చేసే దోపిడిని బహిరంగంగా ప్రకటించాయి కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు..అందులో భాగంగా అడ్మిషన్లకు డిస్కౌంట్ ఇవ్వటమే కాకుండా.. లక్కీ డ్రా ప్రకటించేశారు. అడ్మిషన్ నెంబర్లను లక్కీ డ్రా తీసి బహుమతులు ఇస్తామని హైదరాబాద్ హయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాల ఏకంగా బోర్డులు పెట్టేసి , ప్రచారం చేస్తుంది.ఇంతకీ వారిచ్చే ఆఫర్లు ఏంటో తెలుసా.. ప్లే స్కూల్ నుంచి ఐదో తరగతి వరకు, అదే విధంగా ఐదు నుంచి 10వ తరగతి వరకు వివిధ కేటగిరీల కింద బహుమతులు అనౌన్స్ చేసింది . ఫస్ట్ ప్రైజ్ 2 స్పోర్ట్స్ సైకిల్, సెకండ్ ప్రైజ్ కింద రిమోట్ హెలికాఫ్టర్లు, మూడో ప్రైజ్ కింద స్పోర్ట్స్ కిట్స్ ఇస్తామని వెల్లడించింది. ఆరు బహుమతులను వెల్లడించింది. లక్కీ డ్రాకి అర్హులు కావాలంటే కండీషన్ కూడా ఉంది. మార్చి 22వ తేదీలోగా అడ్మిషన్స్ తీసుకోవాలి. ఇప్పటికే చదువుతున్న పిల్లలు రెన్యువల్ చేసుకోవాలనే నిబంధన పెట్టింది.

నోటీస్ బోర్డులో పెట్టిన ఈ లక్కీ డ్రా ప్రకటనపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువులు చెబుతున్నారా.. వ్యాపారాలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తూ… విద్యాశాఖ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..ఇంతటి వికృతంగా మారిపోయిన విద్యావ్యవస్థ మన పిల్లలను రేపటి పౌరులుగా తీర్చుదిద్దుతుందా??

Comments

comments

Share this post

scroll to top