"కూల్ డ్రింక్స్" మీ పాలిట "కిల్ డ్రింక్"! మన బాడీలోని ఏ పార్ట్ ను ఎలా ప్రభావితం చేస్తాయో చూడండి.

అబ్బా..బయట బాగా ఎండగా ఉందిరా.. పదా ఓ కూల్ డ్రింక్ తాగుదాం ప్రెండ్స్ మద్య సంభాషణ. !  చింటూ మామయ్య బాగా ఎండన పడివచ్చారు వెళ్లి  ఫ్రిడ్జ్ లోని ఓ కూల్ డ్రింక్ పట్ట్రా కొడుకుతో తల్లి.! బిర్యానీ తో పాటు ఓ కూల్ డ్రింక్ ఉంటేనే అసలు మజా…ఓ బిర్యానీ సెంటర్ దగ్గర సంభాషణ.ఈ మొత్తం ఎపిసోడ్ లో కూల్ డ్రింక్ అనే పదం కామన్ అయిపోయింది. అదేదో సర్వ రోగ నివారిణి లాగా.!   గటగటా కూల్ డ్రింక్ లను తాగడం వరకే మనకు తెలుసు. కానీ వాటి వల్ల తర్వాత మన ఆరోగ్యం ఎలా తయారవుతుంది? అనేది మనకు తెలియదు. మన శరీరంలోకి పోయిన కూల్ డ్రింక్ ఏయే అవయవాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెల్సుకుందాం. అమెరికాలో  సంవత్సరానికి  ఒకరు తాగే కూల్ డ్రింక్ సరాసరి  251 లీటర్లంట!

ఎముకల సాంద్రత తగ్గుట:
ఇందులో ప్రతిరోజూ కూల్ డ్రింక్ తాగే మహిళలలో ఎముకల సాంద్రత తగ్గిపోయిందట. 2005లో ఎముక ఖనిజ సాంద్రత (BMD ) పరీక్ష ను కూల్ డ్రింక్స్ తాగే  1413 మంది మహిళలపై, 1125 మంది మగవారిపై  నిర్వహించి అమెరికా వారు ఈ విషయాన్ని దృవీకరించారు.
jp7ygy7hgbh881cs93ap
 కాల్షియం తగ్గిపోవుట:
కూల్ డ్రింక్ లో  ఫాస్పరిక్ ఆసిడ్ ఉండటం వలన ఎముకలలో ఉండే కాల్షియం పూర్తిగా తగ్గిపోతుంది. దీని కారణంగా శరీరం ఏ పనిచేయడానికి సహకరించదు.
ఊబకాయం/బరువు పెరగడం:
ప్రతిరోజూ కూల్ డ్రింక్  తీసుకోవడం వలన సంవత్సరానికి దాదాపు 6.5కేజీలు/14.5 పౌండ్ల బరువు పెరుగుతారు.
c9x2wtk91k0416v4izxa
లివర్ కు ప్రమాదకరం:
కూల్ డ్రింక్ లో శుక్రరసం మరియు మెర్కురీలను కలపడం వలన కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి, ముందుముందు కాలేయం పూర్తిగా చెడిపోయే ప్రమాదం  కూడా ఉంది.
vsfusd33u06dmjzqsv85
మధుమేహం:
ఒక కూల్ డ్రింక్ లో ఉండే చక్కెర దాదాపు 10 టీ స్ఫూన్లతో సమానం.ఇది తాగడం వలన మధుమేహ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ శాతం ఉంది మరియు ఇన్సులెన్ నిరోధం కూడా కోల్పోతారు.
క్యాన్సర్ కు కారణం:
కూల్ డ్రింక్ తీసుకోవడం వలన క్యాన్సర్ ను ప్రమాదకరంగా మారే అవకాశం ఎక్కువ. మధుమేహ వ్యాధితో పాటు దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది.
lypfb95q7903b9jez4yq
హృదయ సంబంధిత వ్యాధులు:
చక్కెర శాతం మనం తీసుకుండే కూల్ డ్రింక్స్ వల్ల   గుండె సంబంధిత వ్యాదులు చోటుచేసు కుంటాయి మరియు గుండెనొప్పికి దారితీస్తాయి.
కృత్రిమ చక్కెరలు:
మనం తీసుకుంటున్న ఈ డ్రింక్స్ కారణంగా కృత్రిమ చక్కెర ఎక్కువగా శరీరంలోకి చేరి  జీవక్రియ మరియు కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపుతుంది.
2c5zdtz3zhp1254iq5w9
దంతాలపై ప్రభావం:
వాటిలోని ఆసిడ్ కారణంగా దంతసమస్యలు వస్తాయి. అలాగే కొత్త బ్యాక్టీరియాలు నోటిలోకి చేరుతాయి. అందువలన నోటి దుర్వాసన మరియు దంత సమస్యలు కలుగుతాయి.
2c19eid8bdngty03s2xi

Comments

comments

Share this post

scroll to top