గ్రామదత్తత దేశసేవకోసం కాదు, ఆదాయపన్ను రాయితీ కోసం అంటూ దర్శకుడి హట్ కామెంట్స్!

గ్రామాలను దత్తత తీసుకుంటున్న సినిమా వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధిచాడు దర్శకుడు తేజ. తన కొత్త సినిమా హోరాహోరి సినిమా  ప్రమోషన్ లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టిన తేజ… గ్రామ దత్తత విషయం లో మహేష్ బాబు పై సంచలన కామెంట్స్ చేశారు.ఇన్ కమ్ టాక్స్ రిడక్షన్ ఇస్తారనే లూప్ హోల్  పట్టుకోని  సినిమా వాళ్లందరూ  ఇలా చేస్తుంటారు.! అంతే తప్ప ఏదో దేశ సేవ కోసం కాదు.  దేశ సేవే అయితే మహేష్ బాబు ఒక్కడు సినిమా హిట్ తర్వాతే  ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలని అన్నారు దర్శకుడు తేజ.

శ్రీమంతుడు తర్వాత  మహేష్, శ్రుతి హసన్, ప్రకాష్ రాజ్ లు ఊర్లను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.. అయితే గత కొంతకాలంగా దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు, గతంలో తెలుగు లో రెండే స్టోరీల మీద సినిమాలొస్తున్నాయని ఘాటుగా విమర్శించిన తేజ , ఇప్పుడు  గ్రామ దత్తత దేశ సేవ కోసం కాదని ఆదాయపన్ను లో రాయితీ కోసం తీసుకున్న స్టెప్ అని డైరెక్ట్ గా విమర్శించారు ఈ డైరెక్టర్.

Watch Video: Teja sensational comments on Mahesh:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top