“నా వల్ల కాదు”..ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్న “డైరెక్టర్ తేజ”.! బాలకృష్ణతో గొడవేంటి.?

ఎన్టీయార్ బయోపిక్ నుండి తేజా తప్పుకున్నారు..టాలివుడ్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..గత నెల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున మంత్రులు,ఎమ్మేల్యేలు,వివిధ పార్టీల రాజకీయ నాయకుల మధ్య రామకృష్ణ స్టూడియోలో ఎన్టీయార్ బయోపిక్ ప్రారంభైన సంగతి తెలిసిందే.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు క్లాప్ కొట్టారు..షూటింగ్ సజావుగా సాగి ఎన్టీయార్ బయోపిక్ విడుదలకోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తేజా తప్పుకోవడం షాకే..తేజా తప్పుకోవడానికి రీజనేంటి.. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు..

కొన్నేండ్ల క్రితం టీనేజ్ ప్రేమకథలతో ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు తేజా.కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత వరుస ప్లాపులతో కనుమరుగయ్యారు. చాలా ఏళ్లవరకు సరైన హిట్ లేదు.ఈ మధ్య రాణాతో నేనే రాజు నేనే మంత్రి సినిమా ద్వారా మళ్లీ హిట్ కొట్టి ఫామ్లో కి వచ్చారు..అప్పుడే ఎన్టీయార్ బయోపిక్ డైరెక్ట్ చేసే అవకాశం తేజాకి దక్కింది.ఈ సినిమాలో బాలక్రిష్ణ ఎన్టీయార్ పాత్ర పోషిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు.దుర్యోదనుడి పాత్రలో కొంచెం షూటింగ్ కూడా జరుపుకుంది..హఠాత్తుగా ఏం జరిగిందో తేజా తప్పుకుంటున్నారనే వార్త ఇండస్ట్రీలో దావాణలంలా వ్యాపించింది..తేజా తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్‌ జీవితాన్ని ఎలా చూపించాలి? ఎక్కడి నుంచి ఎక్కడివరకు ఆయన జీవితాన్ని తెరకెక్కించాలి? అనే విషయాల్లో బాలకృష్ణకు, దర్శకుడు తేజకు మధ్య విభేదాలు వచ్చాయని, స్క్రిప్ట్‌ విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.తేజ కాకుండా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డీల్ చేయబోతున్నారు అనేది కూడా సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. బాలయ్య స్వయంగా దర్శకత్వం వహిస్తారని ఓ ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు క్రిష్ కి కబురువెళ్లిందనే వార్త వినిపిస్తుంది..క్రిష్ ,బాలక్రిష్ణ కాంబినేషన్లో గౌతమి పుత్ర శాతకర్ణి వచ్చిన విషయం తెలిసిందే..క్రిష్ మణికర్ణిక అనే సినిమా షూటింగ్లో బిజిగా ఉండడంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు  దర్శకత్వం వహిస్తారని సమాచారం.

Comments

comments

Share this post

scroll to top