హీరో రాజశేఖర్ కి సపోర్ట్ గా నిలిచిన డైరెక్టర్.

సీనియర్ హీరో రాజశేఖర్ గారు గరుడవేగా సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు, చాలా సంవత్సరాల తరువాత అయన చాలా మంచి సినిమాతో ముందుకు వచ్చారు, జనాలు ఆదరించారు. గరుడ వేగా సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఆయన ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు తీస్తున్నారు, ‘ఆ’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో ఒక సినిమాలో నటిస్తున్నారు రాజశేఖర్. ఈ సినిమా కి కల్కి అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు. 1980 ల నేపధ్యం లో ఈ చిత్రం సాగనుంది. అయితే కల్కి సినిమా షూటింగ్ సమయం లో దర్శకత్వం లో రాజశేఖర్ గారు వేలు పెడుతున్నారు అని ఈ మధ్య పుకారు మొదలయింది, ఈ విషయం పైన ఒక ప్రెస్ మీట్ లో ప్రశాంత్ వర్మ స్పందించారు.

ఆయన చాలా మంచి వారు :

“రాజశేఖర్ గారు సెట్స్ కి వచ్చి ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోతారు, అసలు దర్శకత్వ విభాగం లోనే కాదు, ఎందులో కూడా ఆయన జోక్యం చేసుకోరు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. ఆయన ఈ సినిమా కోసం 100% ఎఫ్ర్ట్స్ పెడుతున్నారు. అంతటి గ్రేట్ యాక్టర్ తో పనిచెయ్యడం చాలా సంతోషంగా వుంది, రాజశేఖర్ గారి పైన వస్తున్న వార్తలు వట్టి పుకార్లు మాత్రమే. అయన చాలా ఉన్నతమైన వ్యక్తి” అని కల్కి మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. కల్కి చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

రాజశేఖర్ గారి గురుంచి :

రాజశేఖర్ గారు చాలా మంచి వారు, ఆయన సినిమా షూటింగ్స్ లో ఆయన పనేదో ఆయన చూసుకుంటారు. వేరే వారి విషయం లో తల దూర్చారు అని సినీ ఇండస్ట్రీ లో పని చేసే వ్యక్తులు కూడా చాలా మంది తెలిపారు. దీంతో ఈ పుకారు ఇక ఇంతటితో ఆగిపోడం పక్కా. కల్కి సినిమా డైరెక్టరే ముందుకు వచ్చి పుకార్లను కొట్టేయడం తో రాజశేఖర్ గారి అభిమానులకి ప్రశాంత్ వర్మ పైన మరింత గౌరవం పెరిగింది.

Comments

comments

Share this post

scroll to top