డైరెక్టర్ క్రిష్ పెళ్లి పత్రిక…స్వయంగా ఆయనే రాశాడంట!?

ఆగస్ట్ 7 న డైరెక్టర్ క్రిష్ వివాహం రమ్యసాయి తో జరగనుంది. ఈ వివాహ మహొత్సవానికి సంబంధించిన శుభలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్వయంగా క్రిష్ తన పెళ్లి శుభలేఖను రాసినట్టు తెలుస్తుంది.  గమ్యం సినిమాతో  తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి, వేదం, కృష్ణం వందే జగద్గురం…లాంటి సినిమాలతో తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న డైరెక్టర్ క్రిష్… కంచె సినిమాతో తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లాడు.  ఇప్పుడు బాలకృష్ణ తో గౌతమీపుత్రశాతాకర్ణి సినిమా తెరకెక్కించే పనులో ఉన్నారు.

మీ అందరి చలువ…నా సినీ జీవితం గమ్యంతో మొదలైంది. నిజమైన నాజీవితం ఇప్పుడు రమ్యం తో మొదలవుతుంది అంటూ తనకు కాబోయే శ్రీమతి పేరును ప్రస్తావిస్తూ…తన పెళ్లికి అందర్నీ ఆహ్వానించాడు క్రిష్.

క్రిష్  వివాహ శుభలేఖ:

 

2krish1b

Comments

comments

Share this post

scroll to top