ఎన్టీఆర్ బయోపిక్ లో డైరెక్టర్ క్రిష్ పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు చిత్రం ఇవ్వాళా విడుదల అయ్యింది, బాలకృష్ణ అన్న గారి పాత్రలో ఒదిగిపోయారు అని అందరూ మెచ్చుకుంటున్నారు, విద్య బాలన్ గారు బసవ తారకం గారి పాత్రలో అద్భుతంగా నటించారు, ఆమె నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించిన తీరు అమోఘం అని చెప్పాలి.

క్రిష్ పారితోషికం :

ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లకు కలిపి క్రిష్ భారీ మొత్తం లో అందుకున్నాడు. గౌతమి పుత్ర శాతకర్ణి కి 4 కోట్లు అందుకున్నాడు ఈ దర్శకుడు, ఆ తరువాత హిందీ లో కంగనా రనౌత్ తో తీసిన మణికర్ణికా చిత్రం కు 5 కోట్లు పారితోషికం అందుకున్నట్టు సమాచారం, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి బాలకృష్ణ నే నిర్మాతగా వ్యవహరిస్తుండటం తో 7-8 కోట్ల మధ్యలో ఉంటదని అందరూ అనుకున్నారు, కానీ అందరూ ఆశ్చర్య పోయే రీతిలో 12 కోట్ల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు సమాచారం.

క్రిష్ అందులో దిట్ట :

క్రిష్ ఇలాంటి సినిమాలు తియ్యడంలో దిట్ట, జనాలను ఆకట్టుకొనే విధంగా కథ ను చెబుతాడు క్రిష్. తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. బాలకృష్ణ తో ఇది వరకు చేసిన గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం తీశారు. ఆ చిత్రం నుండి వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. క్రిష్ మీద ఉన్నా నమ్మకం తోనే ఎన్టీఆర్ బయోపిక్ ని క్రిష్ చేతుల్లో పెట్టారు బాలకృష్ణ. అన్నగారి సినిమాను తీసినందుకు ఎంత ఇచ్చిన తక్కువే అని అభిమానులు అంటున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ -2 మహానాయకుడు ఫిబ్రవరి 7 వ తారీఖున విడుదల కానుంది. రెండవ పార్ట్ పైన అంచనాలు భారీగా పెరిగాయి, మొదటి పార్ట్ చుసిన వారు ర్నెడో పార్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అన్న గారి అభిమానులకు ఈ రెండు నెలలు పండగనే చెప్పాలి. అక్కినేని నాగేశ్వర్ రావు గారి పాత్రలో సుమంత్ నటించారు, చంద్ర బాబు నాయుడు గారి పాత్రలో దగ్గుబాటి రానా నటించారు.

 

Comments

comments

Share this post

scroll to top