SHOCKING NEWS: ‘ఏం మాయచేసావే’ డెరెక్టర్ గౌతమ్ మీనన్ కు రోడ్డు ప్రమాదం…ఇప్పుడు ఎలా ఉందంటే..?

‘ఏం మాయచేసావే’ డెరెక్టర్ గౌతమ్ మీనన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గురువారం (డిసెంబర్-7) మహాబలిపురం నుంచి చెన్నైకి కారులో ప్రయాణిస్తుండగా శోలింగనల్లూరు సిగ్నల్ వద్ద ఆయన కారు, టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో గౌతమ్ మీనన్‌కు పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. స్వల్పంగా గాయపడిన ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. లవ్ స్టీరీస్ తీయడంలో పాపులర్ అయిన గౌతమ్‌ మీనన్‌.. తమిళంతో పాటు తెలుగులో పలు సూపర్‌హిట్ సినిమాలను తెరకెక్కించారు.

Comments

comments

Share this post

scroll to top