“జై లవకుశ” కథ రాసింది ఎన్టీఆర్ కోసం కాదా.? అసలు నిజం బయటపెట్టిన “డైరెక్టర్ బాబీ”.!

మగధీర కథ చిరంజీవి కోసం రాసుకున్నదని  రచయిత విజయేంద్రప్రసాదే స్వయంగా చెప్పారు..అర్జున్ రెడ్డి కూడా అల్లు అర్జున్ ,శర్వానంద్ కాదంటే విజయ్ దేవరకొండ చేశారు..సినిమా  ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్..ఒకరి గురించి రాసుకున్న కథ వేరొకరు చేయడం..ఒకరి టైటిల్స్ మరొకరు  ఇచ్చిపుచ్చుకోవడం..ఇప్పుడు జై లవకుశ విషయంలో కూడా అదే టాక్  నడుస్తుంది.. జై లవకుశ కథ ఎన్టీఆర్ కోసం రాసింది కాదు అనేది ఆ వార్త..

జై లవకుశ కథ ఎన్టీఆర్ కోసం రాసుకున్నది కాదు రవితేజ కోసం రాసిన కథ అనే వార్త ఒకటి హల్ చల్ చేస్తుంది..రవితేజ కాదంటే ఎన్టీఆర్ ని సంప్రదించారని ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేశారంటున్నారు..కానీ స్వయంగా సినిమా దర్శకుడు బాబీయే ఈ వార్తలను కొట్టిపడేశారు..రవితేజ కోసం అనుకున్నది వేరే కథ, వేరే కారణాల వల్ల ఆ సినిమా మొదలవలేదు”“ఎన్టీఆర్ కోసం ఫ్రెష్ గా ‘జై లవకుశ’ కథ రాశాను. ఈ కథ రాస్తున్నపుడు నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. కథ రెడీ అయ్యాక కొరటాల శివను సంప్రదించి ఎన్టీఆర్ ఖాళీగా ఉన్నాడా? లేదా? అని తెలుసుకుని.. ఆ తర్వాత ఎన్టీఆర్ కి కథ చెప్పాను” అని వివరించారు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’కథను తన కంటే ఎక్కువగా నమ్మి కష్టపడ్డారని ..ఈ సినిమా గురించి వస్తున్న వార్తల్ని కొట్టిపడేసారు.

రవితేజతో బాబీ ఫస్ట్ మూవీ పవర్ సూపర్  హిట్ అవ్వడంతో వెంటనే పవన్ కళ్యాన్ మూవీకి పనిచేసే ఛాన్స్ వచ్చింది..రవితేజతో చేసిన పవర్ హిట్ అయినా..పవన్ తో చేసిన సర్దార్ ఫ ట్ అయింది..దాంతో బాబీ తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది..ఆ ఒత్తిడి రాసుకున్న కథే జై లవకుశ..బాబీ కృషికి తగ్గట్టు ఎన్టీఆర్ కూడా సూపర్ గా నటించి తన ప్రతిభను చూపించారు..

Comments

comments

Share this post

scroll to top