మొన్నటి మ్యాచ్ హీరో “దినేష్ కార్తీక్” భార్య “దీపికా” గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.?

నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అంచున నిలుచున్న టీం ఇండియాకు తన అద్భుతమైన ఆటతో విజయాన్ని కట్టబెట్టిన కీపర్ దినేశ్ కార్తీక్ ఒక్కరోజుతో స్టార్ అయిపోయాడు. గత 14 ఏళ్లుగా టీం ఇండియా తరఫున ఆడుతున్న కార్తీక్‌కు అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఈ ఒక్క మ్యాచ్‌తో అతను క్రికెట్ అభిమానుల మనస్సులో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దినేశ్ కార్తీక్ మాత్రమే కాదు అతని భార్య దీపికా పల్లికల్ కూడా దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి.

స్క్వాష్‌ ప్లేయర్ అయిన దీపికా భారత్‌కు ఎన్నో మెడల్స్ తెచ్చిపెట్టింది. 2014 గ్లాస్‌గౌలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం, అదే ఏడాది ఇచియాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. 2012లో స్వ్కాష్‌లో 10వ ర్యాంకు సాధించిన దీపికాకు భారత ప్రభుత్వం అర్జునా అవార్డు ఇచ్చింది. 2012లో కార్తీక్‌కు తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితతో పెళ్లి జరిగింది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల అతను నిఖితతో విడిపోయాడు.

ఆ తర్వాత ఆమెకు మరో టీం ఇండియా క్రికెటర్ మురళీ విజయ్‌తో వివాహం జరిగింది. 2013 డిసెంబర్‌లో కార్తీక్‌‌కి దీపికాతో ఎంగేజ్‌మెంట్, 2015లో వివాహం జరిగింది. కాగా నిదహాస్ ఫైనల్‌లో కార్తీక్ ప్రదర్శనపై దీపికా స్పందించింది. తన జీవితానికి దినేశ్ ఓ సూపర్ హీరో అని ఆమె తెలిపింది. ట్విట్టర్ వేదికగా దినేశ్ ఫోటోని పోస్ట్ చేస్తూ.. మూడు హార్ట్ సింబల్స్ పెట్టింది.

Comments

comments

Share this post

scroll to top