నాగార్జున – దిల్ రాజు మధ్య వివాదం..! కారణం హీరో “నాని”..! అసలేమైందో తెలుసా..?

సిసింద్రీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్  సినిమా హీరోగా మాత్రం ప్రేక్షకులకు చేరువకాలేకపోతున్నారు..నాగచైతన్య మాత్రం తన దైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే..అఖిల్ సినిమాలకు మాత్రం అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి..మొదటి సినిమా అసలు ఎప్పుడు రిలీజైందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు..ఇప్పుడు హలో పేరుతో రెండో సినిమా ద్వారా అయినా హిట్ కొట్టాలనుకుంటున్న అఖిల్,కొడుకుని ఈ సారి అయిన గట్టెంకించాలనుకుంటున్న నాగార్జున ప్రయత్నాలు బెడిసికొట్టేలా ఉన్నాయి…దీనికి కారణం మరెవరో కాదు నాని..

హలో సినిమాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే… హలో మూవీని సోలోగా రిలీజ్ చేయడానికి కుదరడం లేదు. అఖిల్ హలో మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని నాగ్ ఎప్పుడో డిసైడ్ చేశారు. విడుదల చేస్తోన్న ప్రతి పోస్టర్‌ మీద డేట్‌ కూడా వేస్తూ వస్తున్నారు కూడా.. అయితే డిసెంబర్ 21న నేచురల్ స్టార్ నాని నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి MCA సినిమా విడుదల కానుంది.లాంగ్ వీకెండ్ రావడంతో క్రిస్మస్ సెలవుల్ని క్యాష్ చేసుకొనే పనిలో ఇద్దరు హీరోలు పోటీకి దిగుతున్నారు.. దీంతో అఖిల్ మూవీకి నాని మోకాలు అడ్డుపడుతున్న ఫీలింగ్  నాగ్ ది.

అసలే వరుస హిట్లతో దూసుకుపోతున్న నిర్మాత దిల్ రాజు MCA ను డిసెంబర్ 21రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు.హలో డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నాని మూవీ వాయిదా వేయాలని అనుకున్నా… ఓవర్సీస్‌లో క్రిస్మస్‌ టైమ్‌కి వచ్చే సినిమాకి వుండే అడ్వాంటేజ్‌ తెలియడంతో ఆ ఆలోచన మానుకున్నారు.దీంతో అఖిల్ మూవీకి వచ్చే కష్టాల్ని తల్చుకుని నాగ్ వెంటనే దిల్ రాజుతో మాట్లాడి నాని సినిమాను కాస్త ముందుకో వెనక్కో జరపాలని కోరినా, దీనికి దిల్ రాజు నో చెప్పారని సమాచారం..నాని మూవీ మార్కెట్లో ఉంటే… అఖిల్ సినిమా ఖచ్చితంగా సెకండ్ ఛాయిసే అయ్యే ఛాన్స్ ఉంది..

పోటీ తప్పదంటూ.. నాని ఈ మధ్య ట్వీట్ చేశారు… పైగా క్లాష్‌ తెలుగు సినిమాల మధ్య కాదని, సల్మాన్‌ ఖాన్‌ సినిమాతో అని ట్వీట్ చేయడం విశేషం…ఏదేమైనా అఖిల్ సినిమాలకు మాత్రం గండం తప్పట్లేదు..టీజర్ యూట్యూబ్ లో నుండి తీసేయడం…ఇప్పుడు  ఈ విధమైన పోటీ..అఖిల్ కి పెద్ద పరీక్షలే అయ్యాయి..

Comments

comments

Share this post

scroll to top