ప్రేమకు సంకేతం ముద్దు….ముద్దులలో వివిధ రకాలు.

మనసులోని ప్రేమను వ్యక్తపరిచే సాధనం ముద్దు..పసిపిల్లాడి నుండి పండుముసలి వరకు ఏదో ఒక సమయంలో ముద్దును ఆస్వాదించని వారుండరు..కానీ వయసులో ఉన్నప్పుడు పొందే ముద్దు రుచి భిన్నమైనది…అమ్మాయిలు ,అబ్బాయిలు తమ ప్రేమను తెలియపరుచుకునే మొదటి సంకేతం ముద్దు…ముద్దు ఇవ్వడం అనేది ఒక భావన మాత్రమే కాదు అది ఒక కళ కూడా..అలాంటి ముద్దు…పెట్టే విషయంలో కొన్ని చిట్కాలు…

ఫ్రెంచ్ కిస్

ముద్దులలో అగ్రస్ధానంలో ఉండేది అంటే ఎప్పుడూ ఫ్రెంచ్ కిస్సే.. ఫ్రెంచి ముద్దు (French kiss) రొమాంటిక్ లేదా సెక్స్ సంబంధమైనదిగా భావిస్తారు. ఇందులొ ఒకరి నాలుక మరొకరి నోటిలో ప్రవేశించి ఇంకొకరి నాలుకను తాకుతుంది…కోపంగా ఉన్న మీ పార్టనర్ ని కూల్ చేయడానికి ఫ్రెంచ్ కిస్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది.

సింగిల్ లిప్ కిస్

మీ పార్టనర్ కు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారా అయితే మీకు సింగిల్ లిప్ కిస్ కరెక్ట్..సింగిల్ లిప్ కిస్ ఇచ్చేప్పుడు ఎట్టి పరిస్తితులలోనూ కొరకూడదు..అది మీలో ఉన్న వైల్డ్ నేచర్ కు సంకేతంగా మారి మీకు నో చెప్పే అవకాశం ఉంటుంది.

ఐస్ కిస్

మీ భాగస్వామికి ఢిఫరెంట్ గా ముద్దు ఇవ్వాలనుకుంటున్నారా?? అయితే మీ పెదవుల మద్య ఐస్ క్యూబ్ ఉంచుకుని మీ పార్టనర్ కు ముద్దు ఇవ్వండి,అది కరిగేంతవరకు మీరు పెట్టే ముద్దు మీ భాగస్వామి వెన్నులో చలి పుట్టించడమే కాకుండా ,వింతైన అనుభూతిని మీకు మిగులుస్తుంది.

లిజీ కిస్

బల్లి నాలుక బైట పెట్టి ఉంచడాన్ని ఎప్పుడైనా గమనించారా ..ఆ విధంగా ఒకరి నాలుక తో మరొకరి పెదాలను జుర్రుకునేదే లిజీ కిస్..ఇది కొంచెం అసహ్యంగా  అనిపించినప్పటికీ శృంగారప్రియులు ఎక్కువగా ఆస్వాదించడానికి మీ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలపడానికి ఈ ముద్దు తోడ్పడుతుంది.

అమెరికన్ కిస్

ఫ్రెంచ్ కిస్ లాంటిదే అయినప్పటికీ ఇక్కడ నాలుక ఉపయోగించకుండా పెట్టుకునే ముద్దు అమెరికన్ కిస్.

నిబిల్ కిస్

నిబిల్ కిస్ అందమైనదే కాదు మీ పార్టనర్ ఇంద్రియాలన్నింటినీ మీ ఆధీనంలోకి తెచ్చేందుకు తోడ్పడుతుంది.మీ భాగస్వామి కింది పెదవిని కొరకడమే ఈ ముద్దు ప్రత్యేకత.కానీ మరీ హార్ష్ గా ప్రవర్తించకూడదు.నిబిల్ కిస్ మీకొక థ్రిల్ ఫీల్ ను మిగులుస్తుంది.

లిప్ ట్రేస్ ముద్దు

లిప్ ట్రేస్ ముద్దు మీ సమయాన్ని ఉల్లాసభరితం చేసే ఒక మధురమైన ముద్దు.నాలుకతో మీ భాగస్వామి పెదవులను ముద్దు పెట్టుకోవడమే లిప్ ట్రేస్ ముద్దు.

Comments

comments

Share this post

scroll to top