వివాదాలు ఆ నటుడికి కొత్తకాదు, ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో అతని పేరు వినబడుతూనే ఉంటుంది. తాజాగా అంతర్జాతీయ యోగా డే రోజు చిత్ర విచిత్ర యోగాసనాలు చేస్తూ అందరిని నవ్వించాడు. కడుపులో కాస్తంత మందు చుక్క పడిందేమో అందుకే యెగాసనాలు ఇలా వంకరపోతున్నాయ్ అని అనుకుంటున్నారు కొందరు. ఉబ్బిన కండ్లు హీరో గారు మందు తాగారు అనే సింప్టమ్స్ ను చూపిస్తున్నాయట!
విజయ్ కాంత్ యాక్షన్ హీరోగా అందరికీ తెలిసిన తమిళ్ హీరో, ఇంటర్నేషనల్ యోగా డే సంధర్భంగా తమిళనాడు లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయిన ఆయన తెగ హల్ చల్ చేశాడు. యోగా సమయంలో ఊగుతూ తూగుతూ కనిపించారు,యోగాసనాలు చిత్ర విచిత్రంగా చేయడం మొదలు పెట్టాడు. అంతే కాదు ఆయన బాడీ కంట్రోల్ చేయడానికి నానాఇబ్బందులు పడ్డాడు. పాపం భర్తను కంట్రోల్ చేయడానికి భార్య బాగానే కష్టపడిందట ఆ కార్యక్రమంలో, సెలబ్రిటీ కూడా ఇలా చేస్తే ఎలా అని అనుకుంటున్నారు ప్రజలు.