సరిగ్గా కూర్చొని అరగంట కూడా చూడలేని సినిమాను పట్టుకొని కెవ్వుకేక, సూపర్, బంపర్, తొక్కా, తోటకూర కట్ట అని చావ గొడతుంటారు కొందరు, అన్ని ఎలిమెంట్స్ ను టచ్ చేసుకుంటూ విందు భోజనంలాగా ముందుంచిన సినిమాలో.. ఆ సీన్ లో హీరోయిన్ చీర కలర్ బాలేదు, హీరో డాన్స్ చేసేప్పుడు ఎడమ కాలు సరిగ్గా ఊపలేదు. విలన్ డైలాగ్లో ల బదులు ళ అని పలికాడు, మన్ను మశానం అని కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం ఇంకొందరు.
పెట్టిన డబ్బులు వస్తాయా? రావా? అని టెంక్షన్లో నిర్మాత గోళ్ళు కొరుక్కుంటుంటే…. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ , మా హీరో సినిమా కలెక్షన్ల సునామీ అని పీర్ల పండగలో అసైదూల ఆడినట్టు, పూనకం వచ్చినట్టు ఊగుతుంటారు మరికొంత మంది ఫ్యాన్స్. టాలీవుడ్ టు హాలీవుడ్.. వుడ్ ఏదైనా ఇలా రకరకాల ఫ్యాన్స్ ఉంటారు అనేది మాత్రం ఫిక్స్.
మరి టాలీవుడ్ లో ఫ్యాన్స్ ఏయే టైపో ఓ సారి చెపుతా… ఓ లుక్కులుక్కండి:
1)యాంటి ఫ్యాన్స్ 2) హీరో ఫ్యాన్స్ 3) ఐటమ్ సాంగ్ లవర్స్ 4) మెర్సీ బ్యాచ్ 5) టోరెంట్స్ బ్యాచ్ 6) AC-DC బ్యాచ్.. ఈ లెక్కలు.. ఈ బ్యాచ్ లు మీకర్థం కాకుంటే… ఈ వీడియోను వీక్షించాల్సిందే.. నో బ్రేక్స్.. ఓన్లో.. ఎంటర్టైన్మెంట్.
నన్ను అడిగితే వీళ్ళు మా సోషల్ మీడియా చంటి గాడి టైపే..
CLICK: శ్రీమంతుడికి వెళితే ఈ 5 సీన్లు మిస్ అవ్వొద్దు!