ప్రతి “వాట్సాప్ గ్రూప్” లో ఈ 6 రకాల మంది ఉంటారు…అందులో మీరు ఏ టైపో తెలుసుకోండి..!

వాట్సప్ స్టాటస్ లు,ఫేస్ బుక్ లో పోస్టులను బట్టి మనుషులను,వారి పరిస్థితిని అంచనా వేసేస్తున్నారు నేడు చాలామంది..నిరంతరం ఆన్లైన్ లో ఉండి సడన్ గా ఒకట్రెండు రోజులు కనిపించకపోతే వారికి ఏమైందో అనే ఆలోచన వచ్చేంతలా సోషల్ మీడియా మనిషి జీవితంలోకి చొచ్చుకు వచ్చేసింది..మారుతున్న జీవన ప్రమాణాలవలన ఎన్ని ఉపయోగాలున్నప్పటికీ,దుష్పరిమాణాలు లేకపోలేదు..సరే ఇప్పుడు అవి కాదు కానీ మీరు ఆన్లైన్ లో ఉండే విధానాన్ని బట్టి మీకు కొన్ని టైటిల్స్  ఇస్తున్నాం..వీటిల్లో మీకు ఏది సూట్ అవుతుందో మీరే తేల్చుకోండి..

మెరుపువీరులు

నిత్యం ఆన్లైన్లో ఉండడం ప్రతి పోస్టుకి రెస్పాండ్ అయ్యేవారే మెరుపు వీరులు.తినడం అయినా మానేస్తారేమో ,రోజువారి పనులు పక్కకైనా పెట్టేస్తారేమో కానీ ఆన్లైన్లో నుండి తల మాత్రం బయటికి పెట్టరు వీరు..

నిశా చరులు

పొద్దంతా ఉద్యోగం చేసినోడికి రాత్రికి మంచిగా నిద్ర వస్తుంది.కానీ ఈ నిశాచరులు మాత్రం డే టైం అంతా ఆఫీస్ పని అదైపోగానే ఆన్లైన్లో ఉద్యోగానికి దిగిపోతారు.ఆన్లైన్ లో ఉండి ఏ అర్దరాత్రికో , తెల్లవారుఝాముకో తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు నిశాచరులు.

ఏజెంట్ 007

వీళ్లు ప్రతి గ్రూపులో ఉంటారు..అందరు పెట్టే పోస్టలులు చదువుతారు..కానీ ఏ ఒక్కదానికి స్పందించరు.సోషల్ మీడియా గూడాఛారులన్నమాట.వీళ్లనే వాళ్లు ఒకరున్నారన్నదే ఎవరికీ తెలియదు.

వ్యాసమహర్షులు

కట్టె కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పే విషయాన్నైనా మూడు గంటల సినిమాలా సాగదీసి పెట్టడం వీరికి అలవాటు..వారి దగగ్గరి వాళ్లంటే తప్పదన్నటు ఈ వ్యాసరూప పోస్టులు లేదా మెసేజ్ లు చదువుతారు కానీ మిగతావారు మాత్రం ఆ  ఎందుకులే అని లైట్ తీసుకుంటారు..సో వ్యాసమహర్షులు మీ పోస్టులకు,మెసేజ్ లకు కొంచెం కత్తెరేయడం మంచింది.

అమాయక చక్రవర్తులు

అమాయక చక్రవర్తులు అని అనుకుంటారు కానీ కాదు..అక్కడివిక్కడ ఇక్కడివక్కడ పోస్టులు,మెసేజ్ లు చేరవేయడంలో దిట్టలు..ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోయి అమాయకంగా ఒక ఫోజు పెడతారు..

మీడియాలకే మీడియా

వీరి పని ఒకటే అన్ని వార్తలను ,వీడియోలను షేర్ చేయడం..గంటకోసారి ఆన్లైన్ కి రావడం గంపగుత్తగా వార్తల్ని పోస్టు ఆర్ మెసేజ్ చేయడం పారిపోవడం.అవి ఎవరు చూస్తున్నారు..అసలు ఎవరైనా అడిగారా అనేది కూడా ఉండదు వీరికి..

Comments

comments

Share this post

scroll to top