సంక సంగీతంలో మనోడు Ph.D.! ఇతడి ప్రతిభను మాత్రం తప్పక మెచ్చుకోవాల్సిందే!

మీరంతా సంగీతప్రియులా. మీలో సంగీతం అంటే చెవి కోసుకునే వారు ఎంతమంది. ఒకప్పుడు సంగీతం అంటే వినసొంపుగా, ఇప్పుడు మాత్రం డ్రమ్స్,ఎలక్ట్రిక్ ఫైర్ మ్యూజిక్, రాకింగ్..ఇలా మనకు పేర్లు కూడా తెలియని మ్యూజిక్ ఇంస్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆ మ్యూజిక్ ఇంస్ట్రుమెంట్లతో అంత హడావిడి చేస్తుంటే, ఇతగాడు మాత్రం మనకు అలాంటివేవీ అక్కర్లేదంటూ, చేయి సందులో మరో చేయిని బిగించి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు చూడండి. ఆ మ్యూజిక్ కేకో కేక. మధ్యమధ్యలో ఓ సాంగ్ పాడాడు. మన మ్యూజిక్ డైరెక్టర్లెవరో లిరిక్ తగ్గట్లుగా అలాంటి సంగీతాన్ని ఇవ్వలేరేమో. ఒకసారి మీరూ ఆ వీడియోని తిలకించండి.

Watch Video:

మనోడి మ్యూజిక్ ను చూసి చాలామంది మెచ్చుకుంటున్నారు. కానీ ఈ వీడియో చూశాక చిన్నప్పటి స్కూల్ డేస్ గుర్తుకువచ్చాయ్….  సాధారణంగా ఎవరినైనా ఏడిపించాలనుకున్నప్పుడు నలుగురం ప్రెండ్స్ కలిసి ఒకడి వెనకాల చేరి సంకలో చేయి పెట్టి మరో చేయి తో ఇలాంటి సౌండ్ చేసి….అరేయ్ వాడి దగ్గరి నుండి వాసన వస్తుంది రా…. సౌండ్ వదిలింది వాడేరా..అంటూ అందరూ కలిసి  వాడిని ఏడిపించేవాళ్లం. నేను కాదు నేను కాదు అని వాడు ఎంత మొత్తుకున్నా అందరూ వాడిని అదోలా చూసేవారు.

 

Comments

comments

Share this post

scroll to top