కాల్ గ‌ర్ల్-నేను- చివ‌రి క్ష‌ణంలో మారిన నిర్ణ‌యం-నిల‌బ‌డిన జీవితం.!

అవి నేను ఇంజ‌నీరింగ్ చ‌దివే రోజులు. మా ఫ్రెండ్ పండు గాడి బ‌ర్త్ డే….అప్ప‌టి వ‌ర‌కు బ‌ర్త్ డే అంటే…ఏ రెస్టారెంట్ కో, దాబాకో వెళ్ళి తిన‌డం, తాగ‌డం లాంటివి చేసేవాళ్లం…కానీ ఇంజ‌నీరింగ్ థ‌ర్డ్ ఇయ‌ర్ కు వ‌చ్చే స‌రికి మా ఆలోచ‌న‌ల్లో ఛేంజ్ వ‌చ్చేసింది. అందుకే ఈ సారి పండు గాడి బ‌ర్త్ డేను డిఫ‌రెంట్ గా ప్లాన్ చేశాం.! అంద‌రం త‌లా కొంత వేసుకొని….ఓ కాల్ గ‌ర్ల్ కు ఫోన్ చేశాం..రేట్ ఫిక్స్ చేసుకున్నాం, హోట‌ల్ రూం బుక్ చేసుకున్నాం.!

రాత్రి 10 అవుతుంది. బ‌ర్త్ డే బాయ్ తో స‌హా మ‌రో ముగ్గురం హోట‌ల్ రూం కు చేరుకున్నాం.! ఫ‌స్ట్ పండుగాడు ఆమె ద‌గ్గ‌రికి వెళ్లి వ‌చ్చాడు…థ్యాంక్స్ మామా నా బ‌ర్త్ డే ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనంత ట్రీట్ ఇచ్చారు అంటూ బ‌య‌టికి వ‌చ్చేశాడు.. త‌ర్వాత న‌రేష్, ఆ త‌ర్వాత రాము…అంద‌రూ ఏదో గొప్ప విజ‌యం సాధించినంత ఆనందంగా రూమ్ బ‌య‌టికి వ‌చ్చేశారు. ఇక నా వంతు…….

 

భ‌యం భ‌యంగానే లోప‌లికి వెళ్ళాను. 25-27 సంవ‌త్స‌రాల మ‌ద్య వ‌య‌స్సున్న అమ్మాయి…అందానికే ప‌ర్యాయ‌ప‌దంలా ఉంది.! పింక్ క‌ల‌ర్ చీర‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంది.! ముందుగానే చాలా ఊహించా….అవ‌కాశాన్ని అదిమిప‌ట్టుకోవాలని ప‌క్కా ప్లానింగ్స్ తో …!!!

న‌న్ను హ‌గ్ చేసుకోడానికి ఆమె నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది… మిల మిల మెరుస్తున్న ఆమె క‌ళ్ళ‌ల్లో…నా ప్ర‌తిబింబాన్ని చూసుకున్న‌…వెంట‌నే ఆమెను ప‌క్క‌కు తోసేశా…. ఏంటి నేనిలా? ఇంత‌లా ఎందుకు దిగ‌జారాను? ఇదేనా జీవితం? ఇదేనా మా పేరెంట్స్ నా నుండి ఆశించేది…అంటూ ఏవేవో…ఆలోచ‌న‌లు నా మ‌దినిండా.! వెంట‌నే బ‌య‌టికి వ‌చ్చేశాను… ఆ రోజు నుండి మా ఫ్రెండ్స్ దృష్టిలో నేను ఓ చేతకాని వాడిని, మ‌గ‌త‌నం లేని వాడిని…. కానీ నా ఫోక‌స్ మార్చుకున్నాను…చ‌దువు మీద కాన్సంట్రేట్ చేశాను… మంచి ప‌ర్సంటేజ్ తో పాస్ అవ్వ‌డం మంచి కంపెనీలో జాబ్ రావ‌డం చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి.

మ‌ర‌ద‌లితో నా పెళ్ళి జ‌రిగింది. ఆరోజు జ‌రిగిన విష‌యం త‌న‌తో  చెప్పాను.., మొద‌ట అస‌హ్యించుకుంది, త‌ర్వాత అర్థం చేసుకుంది. ఇప్పుడు మేం చాలా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నాం.!

చివ‌ర‌గా నేనేం చెప్పాల‌నుకున్నానంటే…. చేస్తున్న ప‌ని త‌ప్పు అని తెల్సిన‌ప్పుడు చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అవ‌కాశం మ‌న చేతిలోనే ఉంటుంది. అప్ప‌టికైనా మ‌నం రియ‌లైజ్ కాక‌పోతే… మ‌న జీవితాల్ని మ‌న‌మే పాడు చేసుకుంటున్న‌ట్టు లెక్క‌.! థ్యాంక్యూ..!!

Comments

comments

Share this post

scroll to top