పెట్రోల్‌, డీజిల్… రెండూ ఇంధ‌నాలే అయినా వాటిల్లో చాలా తేడాలుంటాయి. అవేమిటో తెలుసా..?

పెట్రోల్‌, డీజిల్‌… రెండూ ఇంధ‌నాలే. వీటిని పెట్రోల్ బంకుల్లో కొంటారు. వాహ‌నాల్లో అక్కడే ఇంధ‌నం నింపుతారు. ఈ రెండింటి రేట్లు కూడా వేర్వేరుగానే ఉంటాయి. అయితే పెట్రోల్‌తో న‌డితే వాహ‌నాలు కొన్ని ఉంటే డీజిల్‌తో న‌డిచే వాహ‌నాలు కొన్ని ఉంటాయి. ఇవి రెండు ఇంధ‌నాలే అయిన‌ప్పుడు రెండింటినీ ఎందులోనైనా వాడుకోవ‌చ్చ క‌దా..? కానీ అలా వాడ‌రు. దీనికి వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో, అస‌లు పెట్రోల్, డీజిల్‌ల మ‌ధ్య ఏమేం తేడాలు ఉంటాయో, వాటిని ఎలా త‌యారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పెట్రోల్, డీజిల్ అంటే అవి క‌ర్బ‌న సమ్మేళ‌నాలు. అంటే ఓ ర‌కంగా చెప్పాలంటే వీటిని ప్ర‌త్యేక‌మైన కెమికల్స్ అని కూడా అనుకోవ‌చ్చు. వీటికి వేర్వేరుగా రసాయన ఫార్ములాలు ఉంటాయి. అయితే రెండూ ఇంధ‌నాలే అయినప్ప‌టికీ రెండింటినీ ఒకే వాహ‌నంలో వాడ‌లేం. దేనిక‌దే ప్ర‌త్యేకంగా వాడాలి. వాటి కోసం త‌యారు చేసిన ఇంజిన్ల‌లో ఈ ఇంధ‌నాల‌ను వాడాల్సి ఉంటుంది. పెట్రోల్‌, డీజిల్ ఇంజిన్లు వేరుగా ఉంటాయి. ఒక దాంట్లో మ‌రో ఇంధ‌నం వాడ‌లేం. ఉదాహ‌ర‌ణ‌కు… మ‌నకు జ్వ‌రం వ‌చ్చింద‌నుకుందాం. అప్పుడు జ్వరం త‌గ్గే కెమిక‌ల్ (మెడిసిన్‌) ఇవ్వాలి. అలా కాకుండా గాయం మానే మెడిసిన్ ఇస్తే తగ్గుతుందా..? త‌గ్గ‌దు. అలాగే డీజిల్ కోసం త‌యారు చేసిన ఇంజిన్‌లో డీజిల్‌ను మాత్ర‌మే పోయాలి. వేరేది పోస్తే ఆ ఇంజిన్ తీసుకోదు. ఫ‌లితంగా ఇంజిన్ చెడిపోతుంది.

ఇక పెట్రోల్‌, డీజిల్ రెండింటినీ ఎలా త‌యారు చేస్తారంటే… రెండూ పెట్రోలియం లేదా ముడి చ‌మురు నుంచి వ‌స్తాయి. దీన్ని వేర్వేరు ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద వేడి చేస్తారు. ఈ ప్ర‌క్రియ‌ను డిస్టిలేష‌న్ అంటారు. ఇందులో భాగంగా వేర్వేరు ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద పెట్రోలియంను వేడి చేస్తే అప్పుడు పెట్రోల్‌, డీజిల్‌లు బై ప్రోడ‌క్ట్స్‌లా వ‌స్తాయి. పెట్రోల్ ఉత్ప‌న్నం కావాలంటే ముడి చ‌మురును 35 నుంచి 200 డిగ్రీల వ‌ర‌కు వేడి చేస్తే చాలు. కానీ డీజిల్ రావాలంటే మాత్రం ముడి చ‌మురును 250 నుంచి 350 డిగ్రీల సెంటీగ్రేడ్‌ టెంప‌రేచ‌ర్ వర‌కు వేడి చేయాలి. అప్పుడే డీజిల్ వ‌స్తుంది.

డీజిల్ క‌న్నా పెట్రోల్ త్వ‌ర‌గా ఆవిరి అవుతుంది. కానీ డీజిల్ అంత సుల‌భంగా ఆవిరి అవ‌దు. డీజిల్ వల్ల ఎక్కువ శ‌క్తి ఉత్ప‌న్నం అవుతుంది. అందుక‌నే దీన్ని భారీ వాహ‌నాల్లో ఎక్కువ‌గా వాడుతారు. పెట్రోల్ త‌క్కువ శ‌క్తిని ఉత్ప‌న్నం చేస్తుంది. ఆ శ‌క్తి టూ వీల‌ర్స్ వంటి వాటికి స‌రిపోతుంది. క‌నుక వాటిల్లో పెట్రోల్ ఇంజిన్ల‌ను పెడ‌తారు. డీజిల్‌తోనే వాహ‌నాల‌కు ఎక్కువ మైలేజ్ వ‌స్తుంది. ఇంజిన్ వేగంగా న‌డుస్తుంది. పెట్రోల్ తో వాహ‌నాల‌కు అంత‌గా మైలేజ్ రాదు. ఇక ముడి చ‌మురును వేడి చేస్తున్న‌ప్పుడు 190 నుంచి 250 డిగ్రీల మ‌ధ్య మ‌రో ఉత్ప‌త్తి వ‌స్తుంది. దాన్నే పారాఫిన్ అంటారు. ఈ ఇంధ‌నాన్ని విమానాలు, హెలికాప్ట‌ర్లు, రాకెట్ల‌లో వాడుతారు.

Comments

comments

Share this post

scroll to top