టేబుల్ స్పూన్, టీస్పూన్ ఈ రెండింటికి మ‌ద్య తేడా ఏంటి? ఈ రెండిట్లో ఏది పెద్ద‌ది?

వంట‌ల ప్రోగ్రామ్ చూసే ప్ర‌తి ఒక్క‌రికీ ఇదో పెద్ద డౌట్? అస‌లు టీస్పూన్ – టేబుల్ స్పూన్ అంటే ఏమిటి? ఈ రెండింటికి మ‌ద్య తేడా ఏంటి? అని జుట్టు పీక్కున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో నేనొక్క‌డిని…అస‌లు ఏంటీ టేబుల్ స్పూన్ ? ఏంటీ టీ-స్పూన్ అని కాస్త లోతుగా సెర్చ్ చేసి నేను తెల్సుకున్న విష‌యాల‌ను ఇప్పుడు మీతో పంచుకునే ప్ర‌య‌త్నం చేస్తాను.

టేబుల్ స్పూన్….
టేబుల్ స్పూన్ అనే ప‌దం 1700 సంవ‌త్స‌రంలో వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌ట్లో హోట‌ల్స్ కు కానీ, ఫంక్ష‌న్స్ కు కానీ వ‌చ్చే వారు త‌మ స్పూన్స్ ను తామే ఇంటి ద‌గ్గ‌రి నుండి తెచ్చుకునేవారట‌.! ముఖ్యంగా స్వీట్స్ తినేందుకు, సూప్స్ తాగేందుకు వీటిని ఉప‌యోగించేవార‌ట‌.! ఒక‌రి ఎంగిలి ఇంకొక‌రికి అంటొద్దు అనే ప‌ద్ద‌తిలో ఎవ‌రి స్పూన్స్ వారే తెచ్చుకునేవార‌ట‌.! కాల‌క్ర‌మేణా హోట‌ల్స్ మ‌రియు ఫంక్ష‌న్స్ లో…. స్వీట్స్, సూప్స్ ను తినేందుకు ఉప‌యోగించే స్పూన్ల‌ను టేబుల్ మీదే అరేంజ్ చేయ‌డంతో…దానికి టేబుల్ స్పూన్ అనే పేరు ఫిక్స్ అయిపోయింది.! ఇలా అరేంజ్ చేసిన‌ప్ప‌టి చాలా రోజుల‌పాటు స్పూన్స్ ను ఇంటి ద‌గ్గ‌రి నుండే తెచ్చుకునేవార‌ట‌…త‌ర్వాత‌ర్వాత అక్క‌డే అరేంజ్ చేసిన టేబుల్ స్పూన్స్ కు అల‌వాటు ప‌డిపోయార‌ట‌.!

  • 1 టేబుల్ స్పూన్ = 3 టీ స్పూన్స్ .
  • 1 టీ స్పూన్ లో = 5 ML.
  • 1 టేబుల్ స్పూన్ = 15ML.

టీ స్పూన్: 
మ‌న ద‌గ్గ‌ర టీ అన‌గానే అల్రెడీ చ‌క్కెర క‌లిపిన టీ ని ఇస్తారు., కానీ ఇత‌ర దేశాల్లో టీ అంటే పాలు, డికాష‌న్ క‌లిపిన మిశ్ర‌మాన్ని మాత్ర‌మే ఇస్తారు…చ‌క్కెర‌ను విడిగా ఇస్తారు. మ‌న‌కు కావాల్సిన మోతాదులో మ‌న‌మే చ‌క్కెర‌ను క‌లుపుకొని తాగాలి. సో అలా క‌లుపుకోడానికి వీలుగా ఓ స్పూన్ ను కూడా ఇస్తారు. దాన్నే టీ స్పూన్ అంటారు.

Comments

comments

Share this post

scroll to top