కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

కార్తిక మాసం మొదలు మార్గశిర పుష్య మాసం వరకూ కొందరు నల్లటి బట్టలేసుకుని ,కఠిన నియమాలను అనుసరిస్తూ స్వామి దీక్షలో ఉంటారు..శబరిలోని కొండల మధ్య కొలువున్న అయ్యప్పను దర్శించుకోవాలంటే భక్తులు తప్పనిసరిగా మాలాధారణ చేసుకోవాలి… అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు 41వ రోజుల పాటు నియమ నిష్టలు పాటించాలి. తర్వాత ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామి సన్నిధానం చేరి స్వామిదర్శనం చేసుకోవడంతో దీక్ష ముగుస్తుంది. స్వామి మాల వేసుకున్న వారిని ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో సంభోదిస్తుంటారు..ఎక్కువగా కన్నెస్వామి,గురు స్వామి అనే పదాలు మనం వినే ఉంటాం…

అయ్యప్ప దీక్షను తొలిసారిగా తీసుకున్న వారిని కన్నెస్వాములు అని అంటారు. కన్నెస్వాములంటే స్వామికి ఎంతో ప్రీతి. అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక్క కన్నెస్వామి ఉండాలని కోరుకుంటారు.మొదటిసారి దీక్ష చేపట్టేవాళ్లు కన్నెస్వాములు అయితే.. రెండోసారి కత్తిస్వామి, మూడోసారి గంటస్వామి, నాలుగోసారి గధాస్వామి, ఐదోసారి గురు స్వామి, ఆరోసారి   జ్యోతి  స్వాములుగా పిలుస్తారు…ఈ విధంగా మొత్తం పద్దెనిమిదాసార్లు మాల వేసుకునే వారికి ఒక్కోసారి ఒక్కో పేరుతో పిలుస్తుంటారు..అంతే కాదు పద్దెనిమిదో సారి మాల వేసుకునే వారిని నారికేళ స్వామి అంటారు..పద్దెనిమిదవ సంవత్సరం కొబ్బిరచెట్టుని తీసుకెళ్లడం ఆనవాయితి…

Comments

comments

Share this post

scroll to top