డైటింగ్ చేసే వారు కామ‌న్‌గా చేసే మిస్టేక్స్ ఇవే… ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి..!

నేటి త‌రుణంలో అధికంగా బ‌రువు ఉన్న వారు త‌మ శ‌రీర బ‌రువును త‌గ్గించుకునేందుకు త‌ప‌న ప‌డుతుంటే స‌రైన బ‌రువు ఉన్న‌వారు దాన్ని నియంత్రించుకోవ‌డం కోసం శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎక్స‌ర్‌సైజ్‌లు, యోగాలు చేయ‌డం, కొవ్వులు త‌క్కువ‌గా, ప్రోటీన్లు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకోవ‌డంపై శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు. ఇంకొంద‌రైతే ఏకంగా తిండి మానేసి దానికి డైటింగ్ అని పేరు పెట్టి బ‌రువు త‌గ్గేందుకు క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే డైటింగ్ అంటే తిండి పూర్తిగా మానేయ‌డం కాదు, తిండిని ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎంత ఎక్సర్‌సైజ్ చేయాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని డైటింగ్ అనే ప‌దం వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అధిక శాతం మంది డైటింగ్ పేరుతో కొన్ని పొర‌పాట్లు చేస్తున్నారు. వాటిని స‌రిదిద్దుకుంటేనే డైటింగ్ చేసిన దానికి ఫ‌లితం ఉంటుంది. లేదంటే ఫ‌లితం ఏమీ ఉండ‌దు. చాలా మంది డైటింగ్ పేరు చెప్పి చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

diet-plan

భోజ‌నం స‌రిగ్గా చేయ‌క‌పోవ‌డం / అస‌లే తిన‌క‌పోవ‌డం – పైనే చెప్పాం క‌దా. తిండి అస్స‌లు తిన‌కుంటే దాన్ని డైటింగ్ అనుకుంటున్నార‌ని. అలా ఎంత మాత్రం కాదు. ఏ పూటైనా మ‌నం చేయాల్సిన భోజ‌నాన్ని మాత్రం మాన‌కూడ‌దు. కాక‌పోతే తిండి తిన‌బుద్ది కాక‌పోతే కొద్ది కొద్దిగా త‌క్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలి. ఇలా తిన‌డం వ‌ల్ల బ‌రువు అదుపులో ఉంటుంది. అంతేకానీ అస్స‌లు తిండి తిన‌క‌పోతే త‌రువాత వ‌చ్చే పూట‌కు సాధార‌ణం క‌న్నా ఎక్కువ‌గానే తింటారు. దీంతో బ‌రువు పెరుగుతుంది.

డైటింగ్ ఎక్కువ‌గా చేయ‌డం – త‌క్కువ మోతాదులో ఆహారం తీసుకుంటూ ఎప్ప‌టి క‌ప్పుడు డైటింగ్ చేస్తుంటే స‌న్న‌బ‌డ‌డం మాట త‌రువాత సంగ‌తి. దాంతో కొంద‌రు ఇంకా బ‌రువు పెరుగుతార‌ట‌. అయితే త‌క్కువ క్యాల‌రీలు ఉన్న పండ్లు, కూర‌గాయ‌ల వంటి వాటిని తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ట‌.

ఎక్కువ‌గా వ్యాయామం చేయ‌డం – బ‌రువు త‌గ్గాల‌నే తొంద‌ర‌లో కొంద‌రు ఎక్కువ‌గా ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తుంటారు. అయితే ఇది ఎంత‌మాత్రం క్షేమ‌క‌రం కాద‌ట‌. ఎందుకంటే ఎక్కువ‌గా ఎక్సర్‌సైజ్‌లు చేస్తే నీర‌సం, అల‌స‌ట‌, కండ‌రాలు ప‌ట్టేయ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అంతేకాదు బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వారంలో 1 కిలో క‌న్నా ఎక్కువ బ‌రువు త‌గ్గితే దాంతో ఆరోగ్య‌ప‌రంగా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అంటే ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ధ‌తిలోనే బ‌రువు త‌గ్గాల్సి ఉంటుంది.

ఫుడ్ స‌ప్ల‌మెంట్లు – బ‌రువు త‌గ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డే ఫుడ్ స‌ప్లిమెంట్లు, టాబ్లెట్లు, ఫ్యాట్ క‌ట్ట‌ర్స్ వంటివి వేగంగా ప‌నిచేస్తాయ‌ట‌. దీంతో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. కానీ అది మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాద‌ట‌. నిదానంగా నెమ్మ‌దిగా బ‌రువు త‌గ్గాల‌ట‌.

చ‌క్కెర‌, కొవ్వులు – బ‌రువు పెరిగిపోతామేమో అన్న భ‌యంతో కొంద‌రు పూర్తిగా చ‌క్కెర‌, కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం మానేస్తారు. కానీ మ‌న శ‌రీరానికి నిత్యం త‌గిన మోతాదులో అవి కూడా అవ‌స‌ర‌మే. కాట‌ట్టి వాటిని పూర్తిగా మానేయాల్సిన ప‌నిలేదు. త‌క్కువ మోతాదులో తింటే దాంతో మ‌న‌కు కావల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే చ‌క్కెర విష‌యానికి వ‌స్తే కృత్రిమంగా క‌న్నా ఆర్గానిక్ ప‌ద్ధతిలో త‌యారు చేసిందైతే బెట‌ర్‌.

ఆల్క‌హాల్‌, పొగ‌తాడం – స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌కుండా మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వంటి ప‌నులు చేస్తే అది మ‌న శ‌రీరానికి అంత మంచిది కాదు. దీంతో బ‌రువు త‌గ్గాల‌నుకున్నా అంత ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

నీరు – రోజూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత నీటిని తాగ‌క‌పోతే అది మన జీవ‌క్రియ‌ల‌పై ప్ర‌భావం చూపుతుంది. ప్రధానంగా డీహైడ్రేష‌న్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. దీనికి తోడు డైటింగ్ కూడా ప‌ద్ద‌తి త‌ప్పుతుంది. నిత్యం ఉద‌యాన నిద్ర‌లేవ‌గానే క‌నీసం 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది.

టీ, కాఫీలు, జ్యూస్‌లు – చ‌క్కెర క‌లిపిన జ్యూస్‌ల‌ను, టీ, కాఫీల‌ను అస్స‌లు తాగ‌కూడ‌దు. స‌హ‌జ సిద్ధ‌మైన జ్యూస్‌ల‌నే తాగాలి. దీంతో డైటింగ్ స‌క్ర‌మంగా జ‌రుగుతుంది.

ప్రోటీన్లు – ప్రోటీన్ షేక్‌ల‌ను ఎక్కువ‌గా తాగితే మ‌న శ‌రీరం నుంచి అన‌వ‌స‌రంగా శ‌క్తి వృథా పోతుంది. నిత్యం మ‌నం చేసే ప‌ని, అందుకు త‌గిన స్థాయిని బ‌ట్టే ప్రోటీన్ల‌ను కార్బోహైడ్రేట్ల‌తో క‌లిపి స‌మ‌తూకంలో తీసుకోవాలి. అప్పుడే మనం చేసై డైటింగ్‌కు క‌రెక్ట్ ఫ‌లితం వ‌స్తుంది.

నిద్ర – చివ‌రిగా నిద్ర విష‌యానికి వ‌స్తే ఏ వ్య‌క్తి అయినా నిత్యం 6 నుంచి 8 గంట‌ల పాటు క‌నీసం నిద్ర పోవాలి. లేదంటే శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల స‌మ‌తుల్య‌త దెబ్బ తింటుంది. దీని వ‌ల్ల డైటింగ్ చేసినా అంత‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. కాబ‌ట్టి క‌నీస నిద్ర త‌ప్ప‌నిస‌రి.

Comments

comments

Share this post

scroll to top