ఒకప్పటి హీరోయిన్ “సంఘవి” గుర్తుందా..? ఇప్పుడేమైందో తెలుసా..? తెలియని విషయాలు ఇవే..!

ఒకప్పటి హీరోయిన్ “సంఘవి” గుర్తుంది కదా? తెలుగు టాప్ హీరోస్ చాలా మంది సరసనే నటించింది ఈ అందాల తార. అందం, అభినయం ఉన్నపటికీ రెండో హీరోయిన్ పాత్రలే ఎక్కువ వచ్చాయి ఈ ముద్దుగుమ్మకి. సంఘవి అసలు పేరు “కావ్య రమేష్”. కన్నడ హీరోయిన్ ఆరతికి మేనకోడలు సంఘవి. తమిళ్ లో అజిత్ సరసన ఫస్ట్ ఫిలిం చేసింది. తెలుగులో తాజ్ మహల్ సినిమాతో పరిచయం అయ్యింది. కెరీర్ సాగుతున్న టైం లో తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది అని టాక్. అతను పెద్దగా హిట్స్ కొట్టకపోవడంతో అందాన్ని వదిలేసింది అని అంటున్నారు.

22 ఏళ్ళ సినిమా కెరీర్ లో 95 సినిమాల్లో నటించింది. అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసి, వయసులో తనకంటే చిన్నవాడైన..బెంగళూరు కి చెందిన సాఫ్ట్ వెర్ ఇంజనీర్ ను గత సంవత్సరం పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్ళికి స్టార్స్ ఎవ్వరు అటెండ్ అవ్వలేదు. కామన్ ఫ్రెండ్ ద్వారా అతనితో పరిచయం అవ్వటంతో ప్రేమ పెంచుకుని పెళ్లి చేసుకుంది. చాలా సంవత్సరాల తరవాత తమిళ్ సినిమాల్లో మళ్లీ ఎంట్రీ ఇవ్వనుంది అంట. తెలుగులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావాలని ఉంది అని తెలిపింది సంఘవి.

Comments

comments

Share this post

scroll to top