సమంత తన ట్విట్టర్ అకౌంట్ లో ఎం అని ట్వీట్ చేసారో తెలుసా..?

సమంత మనసు కూడా అందమైందే. ఎవరికి కష్టం వచ్చినా చలించిపోతుంది. చేతనైనంత సాయం చేసి ఆదుకుంటుంది. టాప్ హీరోయిన్ అయినా భేషజం లేకుండా కలసిపోతుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సమంతకు ప్రజల కష్టాలు, కన్నీళ్లు బాగా తెలుసు. అందుకే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద బాలలను ఆదుకుంటోంది. అనారోగ్యంతో ఉన్న బాలలకు ఆపరేషన్లు చేయిస్తూ ఉంటుంది.

 

తాజాగా సమంత మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. తన కుటుంబం ఈ ఏడాది అంతా వంద మంది చిన్నారులకు ఉచిత భోజనం పెడుతుందని తెలిపింది. ఏడాది మొత్తం ఒక పూట ‘అక్షయపాత్ర’ ద్వారా చిన్నారులకు భోజనం పెడతామని ఆమె ట్విటర్లో పేర్కొంది. ఇందుకు తమ వంతు సాయం చేయాలని అభిమానులను కోరింది. ‘కేవలం రూ.950లతో ఒక స్కూల్ విద్యార్థికి ఏడాది మొత్తం రుచికరమైన పోషకాహారాన్ని అందించవచ్చు.. ’ అని తెలిపింది.

Tweet:

Comments

comments

Share this post

scroll to top