“జవాన్” చేసిన తప్పు అదేనా..? సాయి ధరమ్ తేజ్ ఇలా చేయడం ప్లస్ అవుతుందా.? లేక మైనస్ ఏనా..?

ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న హీరో సాయి ధరమ్ తేజ్..ఇప్పుడు కూడా జవాన్ తో ప్రేక్షకుల ముందుకు రెడీగా ఉన్నారు..కానీ ఈ సినిమాలో అంత విషయంలేదని ముందే చెప్పేస్తున్నారు విమర్శకులు..దీనికి కారణం సినిమా ట్రైలరే..సినిమా చూడాలని ఆసక్తి కలిగించేలా ఉండాలి ట్రైలర్ అంటే..కానీ ఈ సినిమా ట్రైలర్ కట్ ఎవరు చేసారో కానీ సినిమాలో ఏం ఉందో,ఏం లేదో రిలీజ్ కి ముందే చెప్పేవిధంగా కట్ చేసారని విమర్శిస్తున్నారు…!

విజయాలతో ఉన్న సాయి ధరమ్ తేజ్ కి వరుసగా తిక్క, విన్నర్,  నక్షత్రం మూడు సినిమాలు ప్లాప్ అవగా..ఎన్నో ఆశలతో చేసిన సినిమా జవాన్..కానీ ఇది కూడా ఫెయిలవుతుందని ముందే చెప్పేస్తున్నారు..దీనికి పేర్కొన్న కారణాలు ఏంటంటే… కథేంటో  చెప్పకుండా ఊరించాల్సింది పోయి మూడు ముక్కల్లో సినిమా ఏంటో చెప్పేయడం వల్ల ఆ సినిమాపై క్రేజ్ తగ్గిపోయిందని విశ్లేషకుల అభిప్రాయం…“ఆక్టోపస్ మిస్సైల్ ను సైన్యానికి దక్కకుండా తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలనుకుంటాడు విలన్. దాన్ని హీరో అడ్డుకుంటాడు.” ఇది స్టోరీ లైన్. దీనికి తోడు “యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా.. వెనకోడు ఆగిపోయాడా..” అంటూ చెప్పే డైలాగ్,  సినిమా ఏంటనేది విషయాన్ని చెప్పకనే చెప్పేస్తోంది. . తమిళంలో అనేక విజయాలు అందుకున్న ప్రసన్న ఈ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఆ విషయంతోనైనా సినిమాపై క్రేజ్ తీసుకొస్తే బాగుండేదని ,విలన్ ఎవరో కూడా ముందే చెప్పేయడం తుస్ మనిపించింది అంటున్నారు…ట్రైలర్ విషయంలో  తప్పటడుగు వేసిన జవాన్ థియేటర్లో  మెప్పిస్తాడో లేదో….

Comments

comments

Share this post

scroll to top