ఆ చిత్రానికి లక్ష్మీ పార్వతి అంతా తీసుకున్నారా,……

లక్ష్మీస్ ఎన్టీఆర్…. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదల రోజు రోజుకు ఆలస్యమవుతోంది. ఈ నెల 22న విడుదల చేస్తామని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ ఇంకా సెన్సార్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేసారు.

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగుపెట్టినప్పటి నుంచి కథ మొదలు కానుంది. ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి వచ్చిందో అప్పటి నుంచి ఎన్టీఆర్ ను కుటుంబ సభ్యులు దూరం పెట్టడం, చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడవడం, వైస్రాయ్ హోటల్ లో చెప్పులు విసరడం లాంటి సన్నివేశాలను రాం గోపాల్ వర్మ ఈ చిత్రంలో చూపించారు. ఈ కథకు మూలం లక్ష్మీ పార్వతి చెప్పారని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ చిత్రానికి రాయల్టీ కింద లక్ష్మీ పార్వతి కోటిన్నర తీసుకున్నారట. సినిమా సెన్సార్ సమయంలో లక్ష్మీ పార్వతి ఎలాంటి అడ్డు చెప్పకూడదని ముందే ఆమెకు రాయల్టీ చెల్లించారట చిత్ర బృందం. ఈ సినిమాపై ఇప్పటికే వర్మ ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఎన్నికల సీజన్ కూడా కాబట్టి చిత్రానికి బాగానే బిజినెస్ జరుగుతోంది. ఈ విదంగా వర్మ బాగానే క్యాష్ చేసకుంటున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top