బాలయ్య డిక్టేటర్ ట్రైలర్…. డైలాగ్స్ లో అదే దమ్ము.!

నందమూరి నటసింహం బాలకృష్ణ,అంజలి, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లుగా శ్రీవాస్ డైరెక్షన్ లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘డిక్టేటర్’. తాజాగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించిన చిత్ర పాటలు మరియు చిత్ర ట్రైలర్ ను ఏపి క్యాపిటల్ అమరావతిలో అభిమానుల సమక్షంలో విడుదలచేశాడు బాలయ్య. బాలయ్య సినిమాలంటే గుర్తుకు వచ్చేది మాస్ డైలాగ్స్. ఇందులో అలాంటి డైలాగులు చాలానే ఉన్నాయి.“నేను ఏదీ మొదలుపెట్టను, మొదలుపెడితే వదిలిపెట్టను”, ” పంచ్ డైలాగులు నాముందు వద్దు, పనిచూడు”, వంటి డైలాగులు చిత్ర ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. సోనాల్ చౌహాన్ గ్లామర్,అంజలి, బాలయ్య పెయిర్ బాగుంది. తమన్ అందించిన మెలోడీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉన్నాయి.

డ్యూయల్ రోల్ లో బాలయ్య కనిపించనున్న ఈ చిత్రంలో బాలయ్య స్టైలిష్ లుక్ నందమూరి అభిమానులను అలరిస్తోంది. ఇక అమరావతిలో జరిగిన డిక్టేటర్ పాటల వేడుకలో బాలయ్య స్టేజ్ పై చెప్పిన కొన్ని డైలాగులు ఫ్యాన్స్ ని ఉత్తేజపరిచాయి. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ బ్యానర్ పై శ్రీవాస్ లు నిర్మిస్తున్న డిక్టేటర్ చిత్రానికి కోనవెంకట్, గోపీమోహన్ కథ-స్క్రీన్ ప్లే అందించగా, డైమండ్ రత్నం డైలాగ్స్ రాశాడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బాలకృష్ణ 99 వ సినిమాగా రూపొందిన డిక్టేటర్ 2016 పొంగల్ కానుకగా థియేటర్ లలో సందడి చేయనుంది.

Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top