హ్యాట్రిక్ తీసేముందు “కుల్దీప్” కి “ధోని” ఏం చెప్పాడో తెలుసా.? స్టంప్ మైక్ లో రికార్డ్ అయిన మాటలు ఇవే.!

ఆస్ట్రేలియాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ హాట్రిక్ సాధించాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మ్యాచ్ అనంతరం కుల్దీప్ మాట్లాడుతూ.. హాట్రిక్ వికెట్ పడగొట్టడానికి ముందు తాను ధోనీని కలిశానని, అతడు తనను బాగా ప్రోత్సహించాడని చెప్పాడు. ఈ సందర్భంగా ధోనీతో జరిగిన సంభాషణను వివరించాడు.


‘‘అప్పటికే మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్‌ను పెవిలియన్‌కు పంపా. పాట్ క్యుమిన్స్‌కు బౌలింగ్ వేయడానికి ముందు ధోనీని కలిసి సలహా అడిగా. తర్వాత బంతిని ఎలా వేయాలని అడిగా. దానికి మహీ భాయ్ మాట్లాడుతూ ‘తుఝే జైసా భీ లగ్తా హై, వో దాల్ (నువ్వు ఎలా వేస్తావో అలాగే వెయ్) అని సలహా ఇచ్చాడు. అతడు చెప్పినట్టే చేశా. హాట్రిక్ సాధించా’’ అని కుల్దీప్ వివరించాడు. ధోనీ తనకు మద్దతుగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.


ఆసీస్ మ్యాచ్‌లో కుల్దీప్ 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 1987లో చేతన్ శర్మ, 1991లో కపిల్‌దేవ్ ఈ ఘనత సాధించారు. 2014లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పైనా కుల్దీప్ యాదవ్ హాట్రిక్ సాధించాడు. అయితే ప్రస్తుతం సాధించిన హాట్రిక్ మాత్రం చాలా ప్రత్యేకమైనదని కుల్దీప్ పేర్కొన్నాడు. ఈ హాట్రిక్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయిందన్నాడు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top