రైల్వేస్టేషన్ బయట ఉండే “టీ స్టాల్” అత‌నితో కలిసి “టీ” తాగి “భోజనం” చేసిన “ధోని”!..అతనెందుకంత స్పెషల్?

జీవితంలో మనం ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగే ఉండాలి అంటారు…ఆకాశానికి ఎదిగిన తరవాత నేలను అసలు మరిచిపోవద్దు అనే విషయాన్నీ మన భారత మాజీ క్యాప్టియన్ కూల్ “మహేంద్ర సింగ్ ధోని” నిరూపించాడు…క్యాప్టియన్ గా తన ప్రతిభను చాటి అద్భుతమైన వ్యూహాలతో ప్రత్యర్థులను ఓడించి టీం ఇండియాకు వరల్డ్ కప్ సంపాదించి పెట్టి ఎన్నో కోట్ల మంది భారతీయుల కళను నెరవేర్చాడు…అంత గొప్ప స్థాయిలో ఉన్నా గర్వం మాత్రం అణువంతైనా ఉండదు ధోనికి…అందుకే ఎంతోమందికి స్ఫూర్తిదాయకుడు అయ్యాడు…ఇటీవల అతని సినిమా చూసి అతని కథను తెలుసుకున్నాక ఎంతో మంది అభిమానులు పెరిగారు అనడంలో ఆశ్చర్యం ఏం లేదు!

అయితే క్రికెట్ కి రాకముందు “ధోని” ఖరగపూర్ రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా పని చేసాడు అన్న సంగతి ఎంతోమందికి తెలిసిందే…ఇటీవలే ధోని “విజయ్ హజారే” ట్రోఫీ లో “ఝార్కండ్” తరపున ఆడి సెంచరీ స్కోర్ చేసి నాయకుడిగా టీం ని గెలిపించాడు…అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు ధోనిని కలవడం చాలా కష్టం…కానీ దేశవాళీ క్రికెట్ సమయంలో అంత రద్దీ ఉండదు…మ్యాచ్ అయిపోయి వెళ్లే దారిలో “ధోని” తనతో కలిసి ఖరగపూర్ స్టేషన్లో పని చేసిన మిత్రులందరిని కలిసాడు…వారితో కలిసి రైలులో ప్రయాణం కూడా చేసాడు…

అలాగే ఖరాగ్పూర్ స్టేషన్ బయట ఉండే టీ స్టాల్ “థామస్” ని కూడా కలిసి అక్కడ టీ తాగాడంట…తనని గుర్తుపెట్టుకొని ధోని పలకరించినందుకు “థామస్” ఎంతో సంతోషపడ్డాడు…”ధోని” కోసమే పాలు అందుబాటులో ఉంచేవాడు అట థామస్..”ధోని” వారందరితో కలిసి భోజనం కూడా చేసాడు!

Comments

comments

Share this post

scroll to top