వైడ్ బాల్ ని అవుట్ గా మార్చాడు “ధోని”..! DRS అంటే “ధోని రివ్యూ సిస్టం” అని ప్రూవ్ చేసాడు..! [VIDEO]

డీఆర్ఎస్ అంటే అందరికీ తెలిసింది డెసిష‌న్ రీవ్యూ సిస్ట‌మ్‌. అంపైర్ నిర్ణ‌యం త‌ప్ప‌నిపిస్తే.. స‌మీక్ష కోరే అవ‌కాశం అటు బ్యాటింగ్‌, ఇటు ఫీల్డింగ్ టీమ్స్‌కు ద‌క్కుతుంది. కానీ ఈ సిస్ట‌మ్ పేరు ఇక ధోనీ రీవ్యూ సిస్ట‌మ్‌గా మార్చాలేమో. ఎందుకంటే అన్నిట్లాగానే ఇందులోనూ ధోనీ మాస్ట‌ర్ అయిపోయాడు. ధోనీ రీవ్యూ కోరాడంటే వంద శాతం అంపైర్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవాల్సిందే అన్న అభిప్రాయం రోజురోజుకూ బ‌ల‌ప‌డుతున్న‌ది. తాజాగా శ్రీలంక‌తో జ‌రిగిన నాలుగో వ‌న్డేలో ఇది మ‌రోసారి నిరూపిత‌మైంది.

లంక ఓపెన‌ర్ డిక్‌వెల్లా ఔట్ విష‌యంలో ధోనీ అడిగిన రీవ్యూ చూస్తే మీరూ ఇదే విష‌యాన్ని ఒప్పుకుంటారు. లెగ్‌సైడ్ వెళ్తున్న బాల్‌ అత‌ని గ్ల‌వ్స్‌కి త‌గిలి ధోనీ చేతుల్లో ప‌డింది. అప్పీల్ చేసినా ఔటివ్వ‌ని అంపైర్‌.. వైడ్ ఇచ్చాడు. అయినా ధోనీ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ రీవ్యూ కోరాల్సిందిగా విరాట్‌కు చెప్పాడు. తీరా రీప్లేల్లో చూస్తే.. బాల్ అత‌ని గ్ల‌వ్స్‌కు త‌గిలిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో అంపైర్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోక త‌ప్ప‌లేదు. దీనిపై ట్విట్ట‌ర్ మ‌రోసారి ధోనీపై ప్ర‌శంస‌లు కురిపించింది.

watch video here:

దీనిపై ట్విట్ట‌ర్ మ‌రోసారి ధోనీపై ప్ర‌శంస‌లు కురిపించింది.

Comments

comments

Share this post

scroll to top