శ్రీలంకతో మొహాలీలో జరిగే 2 వ వ‌న్డే తర్వాత “రిటైర్” కానున్న ధోనీ.. షాకింగ్ న్యూస్‌..! ఎంఎస్ ధోని కాదండోయి!

చివ‌ర‌కు ఆ రోజు రానే వ‌చ్చేసింది.. ఇండియ‌న్ క్రికెట్ టీంకు నమ్మ‌కంగా ప‌నిచేసిన స‌ర్వెంట్ త్వ‌ర‌లో గుడ్ బై చెప్ప‌నున్నారు. ఈ నెల 13వ తేదీన మొహాలీలో శ్రీ‌లంక‌తో భార‌త్ ఆడ‌నున్న 2వ వ‌న్డే మ్యాచ్ ధోనీకి చివ‌రి మ్యాచ్ కానుంది.. ఏంటీ.. ధోనీ రిటైర్ అవుతున్నారా..? అంటే ఇంక మ‌నం అత‌ని షాట్స్‌ను చూడ‌లేమా..? ఎన్నో సంద‌ర్భాల్లో టీంను విజ‌య తీరాల‌కు చేర్చిన ధోనీ ఇక మ‌న‌కు క‌నిపించ‌డా.. అంటే.. ఆగండి.. మేం చెబుతోంది క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ గురించి కాదు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మేం చెబుతోంది స్నిఫ్ఫ‌ర్ డాగ్ ధోనీ గురించి. ఇంత‌కీ ఆ డాగ్ ఏంటీ..? దాని క‌థేంటో ఓ సారి చూద్దామా..!

ఆ కుక్క పేరు ధోనీ.. ఈ పేరును దానికి పంజాబ్ పోలీసు విభాగం వారు పెట్టారు. ఎందుకంటే అది ఒక స్నిఫ్ఫ‌ర్ డాగ్‌. అనుమానాస్ప‌ద వ్య‌క్తుల‌ను, బాంబుల‌ను క‌నిపెట్ట‌గ‌ల‌దు. అలా ఈ కుక్క ఆ రాష్ట్ర పోలీస్ విభాగంలో గ‌త కొన్నేళ్ల నుంచి సేవ‌లు అందిస్తోంది. ముఖ్యంగా మొహాలీ క్రికెట్ స్టేడియంలో ఎప్పుడూ పోలీసుల‌తోపాటు భ‌ద్ర‌త ఏర్పాట్ల‌లో ధోనీ ఉంటుంది. అక్క‌డ ఏ మ్యాచ్ అయినా ఈ డాగ్‌ను కచ్చితంగా పోలీసులు ఉప‌యోగించుకుంటారు. ఎందుకంటే.. ముందే చెప్పాం క‌దా. బాంబుల‌ను క‌నిపెట్ట‌డంలో ధోనీ పేరెన్నిక‌గ‌న్న‌ది. అయితే ఇది లాబ్ర‌డార్ జాతికి చెందిన‌ది.

ఈ క్ర‌మంలోనే సుదీర్ఘ కాలంగా మొహాలీ క్రికెట్ స్టేడియంలో పోలీసుల‌తో క‌లిసి సేవ‌లు అందిస్తున్న డాగ్ ధోనీ ఈ నెల 13వ తేదీన ఇండియా, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య జ‌రగ‌బోయే 2వ వ‌న్డేతో త‌న ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇవ్వ‌నుంది. ఇందులో భాగంగా పోలీసులు ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయ‌నున్నారు. రిటైర్మెంట్ అనంత‌రం ఎవ‌రైనా దీన్ని ద‌త్త‌త తీసుకోవ‌చ్చు. నెల‌కు రూ.800 చెల్లిస్తే చాలు, ద‌త్త‌త ఇస్తారు. అయితే ఈ ధోనీ డాగ్ త‌న పోలీస్ లైఫ్‌లో ఎన్నో అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల‌కు భ‌ద్ర‌త‌గా ఉన్న‌ది. ముఖ్యంగా 2011లో ఇండియా పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో భ‌ద్ర‌త‌లో ఈ ధోనీ డాగ్ పాల్గొంది. ఇలాంటి ఎన్నో మ్యాచ్‌ల‌లో స్నిఫ్ఫ‌ర్ డాగ్‌గా ధోనీ సేవ‌లందించింది. ఇప్పుడు రిటైర్ కానుంది. అంతేకానీ… నిజంగా క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ రిటైర్ అవుతున్నాడు అనుకునేరు.. అందుకు ఇంకా స‌మ‌యం ఉంది..!

Comments

comments

Share this post

scroll to top