త‌న మొద‌టి గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌రో చెప్పేసిన ధోనీ.. ఆమె ఎవ‌రో తెలుసా..?

మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్‌కు పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఆటగాళ్లలో ధోనీ ఒకడు. వ‌ర‌ల్డ్ టీ20 క‌ప్‌, వ‌ర‌ల్డ్ క‌ప్‌, చాంపియ‌న్స్ ట్రోఫీల‌ను భారత్‌కు సాధించి పెట్టిన ఏకైక కెప్టెన్ ఇత‌ను. మైదానంలో త‌న ఆట‌తీరుతోనే కాదు, త‌న కూల్ ప్ర‌వ‌ర్త‌న‌తోనూ ఎంతో మంది అభిమానాన్ని ఇత‌ను చూర‌గొన్నాడు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ధోనీ జీవితం ఆధారంగా ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్‌ స్టోరీ అనే చిత్రం కూడా వ‌చ్చింది. అది బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని విజ‌యాన్ని సాధించింది. అయితే మిస్టర్‌ కూల్‌‌గా పేరొందిన ధోనీ ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను బయటి ప్రపంచానికి తెలిపేందుకు పెద్దగా ఆసక్తి చూపడు. కానీ అభిమానులు మాత్రం ధోనీ వ్యక్తిగత విషయాలు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ధోనీ త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి చెందిన ఓ ముఖ్య‌మైన విష‌యాన్ని మాత్రం ఇటీవ‌లే చెప్పేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా ఓ ప్ర‌మోష‌నల్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఆ ప్రమోషనల్ ఈవెంట్‌లో ధోనీ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమానికి ధోనీతో పాటు ఇత‌ర చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాళ్లు షేన్‌ వాట్సన్‌, రవీంద్ర జడేజా, సురేశ్‌ రైనాతో పాటు కొంత మంది ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. అయితే ఆ ఈవెంట్‌లో భాగంగా ముందుగా క్రీడాకారుల‌తో ప‌లు ఫ‌న్నీ గేమ్స్ ఆడించారు. అనంతరం యాంక‌ర్ ధోనీని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగాడు. వాటికి ధోనీ కూల్‌గా స‌మాధానాలు చెప్పాడు.

అయితే స‌ద‌రు యాంక‌ర్ ధోనీని ప్ర‌శ్న‌లు అడుగుతూ అందులో భాగంగా ధోనీని త‌న మొదటి గ‌ర్ల్ ఫ్రెండ్ ఎవ‌రు అని అడిగాడు. అందుకు ధోనీ మొద‌ట అయిష్ట‌త‌ను వ్యక్తం చేశాడు. అయినా స‌మాధానం చెప్పాడు. అప్పట్లో ఇలాంటి ట్రెండ్‌ లేదని అన్న ధోనీ నెమ్మ‌దిగా తన ఫస్ట్‌ క్రష్‌ స్వాతి అని తెలిపాడు. అయితే ఈ విష‌యం తన భార్యకు చెప్పొద్దని సరదాగా వ్యాఖ్యానించాడు. తాను 1999లో ఇంటర్మీడియెట్‌ చదువుతున్నప్పుడు అ అమ్మాయిపై క్రష్‌ ఏర్పడిందని ధోనీ వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజిలో అభిమానులతో పంచుకుంది. దీంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. కాగా ధోనీ తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని 2010లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ధోనీకి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు జీవా.

Watch video :

Comments

comments

Share this post

scroll to top